ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌ : టీడీపీ వర్సెస్ జనసేన

Update: 2022-03-20 05:30 GMT
భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్‌ ఆర్‌ ఆర్‌ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్ణాటక లోని చిక్బుల్లాపూర్‌ లో మెగా నందమూరి అభిమానులతో పాటు కన్నడ సినీ ప్రేమికులు ప్రేక్షకుల సమక్షంలో భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమం కు కన్నడ సీఎం తో పాటు మంత్రులు కూడా హాజరు అవ్వడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ భారీ సినిమా ఈవెంట్ కు పార్టీల జెండాలు పట్టుకుని అభిమానులు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఈవెంట్‌ లో ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున తెలుగు దేశం పార్టీ జెండాలతో ఈవెంట్‌ స్టేడియంలో సందడి చేయడం జరిగింది. అదే సమయంలో రామ్ చరణ్‌ అభిమానులు జనసేన పార్టీ జెండా లు పట్టుకుని స్టేడియం మొత్తం హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. రెండు పార్టీలకు చెందిన అభిమానులు మీడియా దృష్టిని ఆకర్షించారు. ఒకానొక సమయంలో అభిమానుల మధ్య గొడవ కూడా జరిగింది.

ఒక భారీ టవర్ పై మొదట జనసేన జెండాలను రామ్‌ చరణ్ అభిమానులు పెట్టారు. ఆ జెండాలను తొలగించి తమ జెండాలను పెట్టేందుకు ఎన్టీఆర్‌ అభిమానులు తెలుగు దేశం జెండా తో టవర్‌ వద్దకు వెళ్లడం ఆ సమయంలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొనడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన విడుదల కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్నట్లుగా జరుగుతున్న ఈ సమయంలో ఇద్దరు హీరోల అభిమానుల గొడవలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.

ఇప్పటికే తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అన్నట్లుగా యూఎస్ తో పాటు దేశం లో పలు చోట్ల ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ అభిమానులు డామినేషన్ ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో కూడా పతాక స్థాయిలో అభిమానుల మద్య ట్రోల్స్ మరియు విమర్శలు నడుస్తున్నాయంటూ సమాచారం అందుతోంది. ఈ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆ గొడవకు ప్రత్యక్ష్య సాక్ష్యంగా నిలుస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ లో జనసేన మరియు టీడీపీ జెండాలు సందడి చేయడం వరకు ఓకే గాని ఒకరి జెండాలను మరొకరు తొలగించే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా కాస్త ఆలోచించాల్సిన విషయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని లైట్‌ తీసుకుంటే కచ్చితంగా ముందు ముందు సినిమా విడుదల అయిన తర్వాత అభిమానుల మద్య పతాక స్థాయికి గొడవ పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News