యానిమల్ బ్యూటీని బ్యాన్ చేయాలని పిలుపు
జైపూర్‌లో సోమవారం సాయంత్రం జరగాల్సిన ఒక కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ట్రిప్టి డిమ్రీపై మహిళా పారిశ్రామిక వేత్తలు గరంగరంగా స్పందిస్తున్నారు.
`యానిమల్` చిత్రంతో వేవ్ లా దూసుకొచ్చిన ట్రిప్తి దిమ్రీ ప్రస్తుతం వరుస చిత్రాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రోజుకో కొత్త ప్రాజెక్టుకు ట్రిప్తీ సంతకం చేస్తోంది. అయితే ఇంతలోనే ఒక చిన్న అపశ్రుతి.
జైపూర్‌లో సోమవారం సాయంత్రం జరగాల్సిన ఒక కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ట్రిప్టి డిమ్రీపై మహిళా పారిశ్రామిక వేత్తలు గరంగరంగా స్పందిస్తున్నారు. FICCI FLO ఈవెంట్ కోసం అతిథిగా మహిళా పారిశ్రామికవేత్తలు ట్రిప్తీని పిలిచారు. కానీ తన కమిట్ మెంట్ ని నెరవేర్చడంలో తడబడింది. ఇప్పుడు ట్రిప్తీని అలాగే తన తదుపరి విడుదల `విక్కీ విద్యా కా వో వాలా` వీడియోను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
మరింతగా వివరాల్లోకి వెళితే.. JLN మార్గ్‌లో ఉన్న ఒక హోటల్‌లో నారీ శక్తిపై జైపూర్‌లో FICCI FLO నిర్వహించిన ఈవెంట్‌కు ట్రిప్తీ హాజరు కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ వేడుకకు రాలేకపోయింది. ఈవెంట్‌లను నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరు తాను మరో 5 నిమిషాల్లో వస్తానని కాల్ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం ట్రిప్తీతో రూ.5.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. కానీ ఈవెంట్ కి ట్రిప్తీ హాజరు కాలేదు. ఆ తర్వాత ట్రిప్తి దిమ్రీపై టీమ్ కేసు నమోదు చేస్తామని తెలిపింది. ఈ విధంగా మోసం చేసినందున ట్రిప్తీ సినిమాలను బహిష్కరించాలని ఆమె పేర్కొంది. పలువురు వ్యక్తులు ఈ కార్యక్రమంలో ట్రిప్తీ పోస్టర్‌ను చించేయడం ద్వారా తనను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పోస్టర్‌ను పూర్తిగా తొలగించారు.
ట్రిప్తీ తన సహనటుడు రాజ్‌కుమార్ రావుతో కలిసి విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియోను ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 90ల నాటి కొత్తగా పెళ్లయిన జంట పోగొట్టుకున్న సె* టేప్ గురించిన కామెడీ. టైటిల్ జంటగా రాజ్‌కుమార్ - త్రిప్తి లతో పాటు ఈ చిత్రంలో మల్లికా షెరావత్, విజయ్ రాజ్, రాకేష్ బేడి, అర్చన పురాణ్ సింగ్, టికు తల్సానియా, ముఖేష్ తివారీ కూడా నటించారు. విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో అక్టోబర్ 11 న థియేటర్లలో విడుదల కానుంది. అలియా భట్ జిగ్రాతో ఈ మూవీ ఢీకొంటుంది.