బిగ్ బాస్ 8 : అన్ లక్కీ మణికంఠ.. బట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో మణికంఠ ఆట తీరు ఆడియన్స్ కు కొంత షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.

Update: 2024-10-02 05:37 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో మణికంఠ ఆట తీరు ఆడియన్స్ కు కొంత షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. ప్రతి టాస్క్ లో.. హౌస్ లో జరిగే ప్రతి గొడవలో మణికంఠనే కార్నర్ చేస్తూ కొంత అసంతృప్తి భావన వ్యక్తమవుతోంది. ఐతే తన కన్ ఫ్యూజన్ వల్ల మణికంఠ ఒక స్టాండ్ తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగుతుందని తెలుస్తుంది. మణికంఠ బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారమే సింపతీ కార్డు వాడటం వల్ల హౌస్ లో ఉన్న వారంతా ఇదంతా అతని గేమ్ స్ట్రాటజీ అని ఫిక్స్ అయ్యారు.

కానీ మణికంఠ ఒక కన్ ఫ్యూజింగ్ పర్సనాలిటీ అని అతని ఆట తీరు చూస్తే అర్ధమవుతుంది. మణికంఠ విషయంలో తను చేసిన తప్పుని ఒప్పుకోడు అన్నది హౌస్ మెట్స్ మేజర్ గా చెప్పే పాయింట్. మంగళవారం ఎపిసోడ్ లో కూడా మణికంఠకు మళ్లీ బ్యాడ్ లక్ వెంటాడింది. హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని తగ్గించేలా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. గత వారమే ఈ టాస్క్ లో ఓడిన క్లాన్ నుంచి ఒక కంటెస్టెంట్ ని ఆటలోంచి తప్పించాలని అంటే నిఖిల్ క్లాన్ నుంచి మణికంఠని తప్పించారు.

ఇప్పుడు మణికంఠ క్లాన్ మారాడు. ప్రస్తుతం సీత క్లాన్ లో ఉన్న మణికంఠ నిన్న సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ ఛాలెంజ్ లో ఒక టాస్క్ ఓడిపోయాడు. చేసేదేమి లేక మళ్లీ సీత క్లాన్ లో కూడా మణికంఠని తీసేయాలని నిర్ణయించారు. అలా రెండు వారాలు రెండు క్లాన్స్ నుంచి తనని తప్పించడం వల్ల మణికంఠ బాధపడినట్టు అనిపిస్తుంది. తనకు తాను ఎంత బలం తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఒక్కడే సోఫాలో కూర్చుని కనిపించాడు.

ఐతే హౌస్ లో మణికంఠ పరిస్థితి అలా ఉంటే అతని ఆట.. టాస్క్ చేయాలన్న అతని ప్రయత్నాలు చూస్తున్న ఆడియన్స్ అతనికి సపోర్ట్ గా ఉంటున్నారు. ఈ వారం నామినేషన్స్ లో మణికంఠ కూడా ఉన్నాడు. సో ఈ వారం అతన్ని సేవ్ చేసే బాధ్యత మీద వేసుకున్నారు ఆడియన్స్. ఐతే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు. అలా అయితే మణికంఠనే మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేస్తారేమో అని డౌట్ మొదలైంది. ఐతే వీకెండ్ లో మాత్రం నైనిక హౌస్ కి గుడ్ బై చెప్పేస్తుందని ఓటింగ్ ఎనాలసిస్ ని బట్టి తెలుస్తుంది.

Tags:    

Similar News