జస్ట్ ఇమాజిన్.. తండేల్ లో కింగ్ ఉంటే..?
ఈ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు అన్నీ కూడా సినిమాపై మరింత బజ్ పెంచుతున్నాయి.
యువ సామ్రాట్ నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన సినిమా తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో ఇప్పటికే సినిమా రేంజ్ పెరిగింది. తండేల్ తో రీ సౌండ్ గట్టిగా వినిపించేలా నాగ చైతన్య అదరగొట్టబోతున్నాడని అర్ధమవుతుంది. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు అన్నీ కూడా సినిమాపై మరింత బజ్ పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటి అంటే చైతన్య తండేల్ లో కింగ్ నాగార్జున క్యామియో ఉంటుందా అని. నాగ చైతన్య సినిమాలో నాగార్జున ఉంటాడా.. ఏమో చెప్పలేం. సినిమాలో సర్ ప్రైజ్ లా అదేమైనా ప్లాన్ చేశారేమో అని అనుకుంటున్నారు. తండేల్ లాంటి సినిమాలో నాగార్జున క్యామియో ఉంటే మాత్రం సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడుతుంది. నాగ చైతన్య, నాగార్జున కలిసి ఇప్పటికే మనం, బంగార్రాజు సినిమాలు చేశారు.
తండేల్ సినిమా లవ్ స్టోరీగా వస్తుంది. ఈ సినిమాలో నాగార్జున అలా వచ్చి ఒక సెకన్ కనిపించినా ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఐతే ఆ అవకాశం ఉంటున్నట్టు కనిపించట్లేదు. తండేల్ లో నాగార్జున క్యామియో ఉంటే అదిరిపోతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చందు మొండేటికి ఈ ఐడియా రాలేదా ఒకవేళ వచ్చినా సోలోగా చైతన్య సత్తా చాటేలా ఉండాలని తీసుకోలేదా. ఇలా చాలా డిస్కషన్స్ తెర మీదకు వస్తాయి.
ఏది ఏమైనా అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాకు రిలీజ్ ముందు ఈ రేంజ్ పాజిటివ్ బజ్ అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుంది. చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన తండేల్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. చైతన్య, సాయి పల్లవి కాంబో కూడా ఈ సినిమాకు స్పెషల్ గా నిలిచేలా ఉంది. దేవి మ్యూజిక్ కూడా ఆడెడ్ అడ్వాంటేజ్ కాబట్టి తండేల్ ఏదో సరికొత్త మ్యాజిక్ చేసేలా ఉందని చెప్పొచ్చు.