కియారా నటనపై యష్ అసంతృప్తి?
ఈ నేపథ్యంలో హీరోయిన్ ను మార్చే అవకాశాలున్నాయని శాండివుల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాక్సిక్ లో హీరోయిన్ పాత్రకు నటనా ప్రాధాన్యం చాలా ఉంటుందట.
తెలుగు సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారనగానే ఆ సినిమాకు ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుతుంది. అయితే కేవలం క్రేజ్, బాలీవుడ్ హీరోయిన్ ఉందనే కారణంతో సినిమాలు ఆడవనే విషయాన్ని ఆడియన్స్ అర్థం చేసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కియారా అద్వానీ తెలుగులో చేసిన సినిమాలే.
కియారా ఇప్పటివరకు తెలుగులో మొత్తం మూడు సినిమాలు చేసింది. ఆ మూడింటిలో భరత్ అనే నేను సినిమా ఒక్కటే బాక్సాఫీస్ వద్ద హిట్టైంది. రామ్ చరణ్ తో చేసిన మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయితే చరణ్ తో చేసిన సినిమాలు డిజాస్టర్ అవడానికి తానేమీ కారణం కాకపోయినా ఆ సినిమాలకు సంబంధించిన ఫలితాలు మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి.
చరణ్, కియారా కలయికలో వచ్చిన వినయ విధేయ రామ బాగా ఆడకపోయినా మంచి ఓపెనింగ్స్, టీవీలో మంచి టీఆర్పీలు వచ్చాయి. కానీ గేమ్ ఛేంజర్ కు మాత్రం అలా కాదు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా చాలా ఆలోచించి సౌత్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ తనకు సరైన హిట్లు పడటం లేదు. అయితే కియారా ప్రస్తుతం సౌత్ మూవీ టాక్సిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొంత కీలక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. కానీ షూట్ చేసిన పోర్షన్ లో కియారా నటన పట్ల యష్ శాటిస్‌ఫై అవడం లేదని, ఈ నేపథ్యంలో హీరోయిన్ ను మార్చే అవకాశాలున్నాయని శాండివుల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాక్సిక్ లో హీరోయిన్ పాత్రకు నటనా ప్రాధాన్యం చాలా ఉంటుందట.
కానీ కియారా నటన యష్ ను మెప్పించలేకపోవడంతో హీరోయిన్ ను మార్చాలని యష్ చెప్పాడని టాక్. దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఒకవేళ ఇది నిజమే అయితే కియారాకు ఇదొక బ్యాడ్ రిమార్క్ గా ఉండిపోనుంది.