పూజాహెగ్డే మళ్లీ గాడి తప్పుతుందా?
ముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ గాడి తప్పుతోందా? చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేస్తోందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ గాడి తప్పుతోందా? చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేస్తోందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. పూజాహెగ్డే సౌత్ కి మళ్లీ ఎలా కంబ్యాక్ అవుతుందో తెలిసిందే. తెలుగు, తమిళ్ లో పుల్ బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ అంటూ ఇక్కడ అవకాశాల్ని వదులుకుని మరీ వెళ్లింది. కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏవీ ఆశించిన ఫలితాలివ్వలేదు. దీంతో పెద్దగా సమయం వృద్ధా చేయకుండా వెంటనే మళ్లీ సౌత్ లో అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయింది.
లక్కీ గా అవకాశాలు వచ్చాయి కాబట్టి సేఫ జోన్ లో పడింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ కొత్త ఛాన్సులందు కుంటోంది. దీంతో మళ్లీ బుట్టబొమ్మ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమనే అంచనాలు ఏర్పడుతున్నాయి. 'రెట్రో', 'జననాయగన్' చిత్రాల్లో నటిస్తోంది. రెండు భారీ ప్రాజెక్ట్ లే. అలాగే టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. కానీ వాటిని హైడ్ చేసింది. అయితే 'రెట్రో' ,'జన నాయగన్' చిత్రాలు రిలీజ్ అయ్యే వరకూ కొత్త సినిమాలు వేటికి కమిట్ అవ్వకూడదని నిర్ణయించుకుందట.
ఈ క్రమంలో వచ్చిన కొన్ని ప్రాజెక్ట్ లను రిజెక్ట్ చేసిందని సమాచారం. అయితే అవి సౌత్ సినిమాలా? బాలీవుడ్ సినిమాలా? అన్నది సస్పెన్స్. దీంతో పూజాహెగ్డే మళ్లీ పాత దారిలో వెళ్తోందా? అన్న అనుమానం మొదలైంది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా ఇక్కడ సినిమాలు కాదని బాలీవుడ్ కి వెళ్లి ఎలా దెబ్బైందో తెలిసిందే.
ఇప్పుడు వస్తోన్న అవకాశాల్ని కాదని మళ్లీ అలా రేసులో వెనుకబడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుట్ట బొమ్మ సౌత్ లో తమిళ సినిమాలకంటే ఎక్కువగా తెలుగు సినిమాలే చేసింది. వాటితోనే సౌత్ లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.