ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్ ..
బాలయ్యకు పద్మభూషణ్ దక్కడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఆయన అందించిన సేవలకు గానూ ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్‌తో పురస్కరించింది. బాలయ్యకు పద్మభూషణ్ దక్కడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అన్నయ్య బాలకృష్ణ ఇంత గొప్ప ఘనత సాధించినందుకు తన చెల్లెలు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి నిన్న ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న చంద్రబాబు ఫామ్ హౌస్‌లో ఈ పార్టీ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ పార్టీకి హాజరైనట్టు సమాచారం.
ఇరు కుటుంబాలకు సంబంధించిన వారితో పాటూ తమకు అత్యంత సన్నిహితులు, బాలయ్యతో పని చేసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, బాలయ్యతో పని చేసి వరుస హిట్లు అందుకున్న తమన్ కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు.
ఈ పార్టీకి హాజరైన తమన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి దిగిన ఫోటోను తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ పార్టీకి ఎవరెవరు వెళ్లారు, పార్టీ ఎలా జరిగింది, దానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావాల్సి ఉంది.
సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ, ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తాండవం చేస్తున్నాడు. అఖండ2 సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్ లో రిలజ్ చేయనున్నట్లు అనౌన్స్‌మెంట్ రోజే మేకర్స్ తెలిపారు. అఖండ2కు కూడా తమనే సంగీతం అందించనున్నాడు.