అమ్మాయి అబ్బాయి ప్రేమకథ.. భార్య భర్తల అనుబంధం.. తండ్రి కొడుకుల.. అన్నదమ్ముల.. అక్కా చెల్లెళ్ల ఎమోషనల్ బాండింగ్ పై సినిమాలు కొత్తేమీ కాదు కానీ.. ఈ తరహా కథల్ని ఎంచుకుని వాటిని జనాలకు కనెక్ట్ చేయడంలో నేర్పు ప్రదర్శించేవాడే సత్తా ఉన్న దర్శకుడు. ఇలాంటి విషయం ఉన్న దర్శకుడిగా శివ నిర్వాణకు గుర్తింపు ఉంది. ఇంతకుముందు నానీని నిన్ను కోరి చిత్రంలో వీర ప్రేమికుడిగా చూపించారు. ఆ మూవీలో అప్పటికే యంగేజ్ మెంట్ అయిన అమ్మాయి చుట్టూ నాని ప్రదర్శించే ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఆద్యంతం మైమరిపిస్తుంది.
నిన్నుకోరి హిట్టయ్యింది. ఆ తర్వాత నాగచైతన్య-సమంత జంటగా వాల్టేర్ లవ్ స్టోరి అంటూ ప్రేయసితో భార్యతో ఎమోషనల్ లవ్ లో ఉండే కుర్రాడిగా చైతూని గొప్పగానే చూపించాడు. మొత్తానికి ఎమోషన్ రగిలించి బాక్సాఫీస్ హిట్టు పట్టేస్తున్నాడు శివ నిర్వాణ.
ఇప్పుడు టక్ జగదీష్ లో నానీని ఎలా చూపించబోతున్నాడు? అన్నదానికి మొన్ననే ఒక పోస్టర్ ని శాంపిల్ గా వదిలాడు. ఇందులో టక్కు తీయకుండానే పొలం బురదలోకి దిగి గునపం పట్టిన ఆవేశ పరుడిగా నానీని ఆవిష్కరించాడు. అయితే ఆ ఆవేశం వెనక కథేంటో సినిమా చూస్తే కానీ తెలీదు. కానీ ఈ మూవీలో అన్నదమ్ముల సెంటిమెంట్ ఆద్యంతం కట్టిపడేస్తుందట. అన్న కోసం తమ్ముడు తమ్ముడి కోసం అన్న ఎమోషన్ సీన్స్ రక్తి కట్టిస్తాయని సినిమాకి హైలైట్ సీన్ వీటి నుంచే పుట్టిందని కూడా చెబుతున్నారు.
నాని కెరీర్ 26వ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ గా ఉంటాయి. బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి- హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వర్మ- ఐశ్వర్యా రాజేష్ నాయికలుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.