మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీకి సౌత్ లోనే కాదు నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ దూసుకుపోతోంది. రీసెంట్ గా తమన్నా 'బబ్లీ బౌన్సర్' అనే కామెడీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మధుర్ బండార్కర్ తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా తమన్నా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తో కలిసి 'ప్లాన్ ఎ ప్లాన్ బి' అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ సమస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ఒరిజినల్ ను రూపొందించింది. శశాంక ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు రజత్ అరోరా కథ అందించారు. పూనమ్ ధిల్లాన్, కుష కపిల కీలక పాత్రలను పోషించారు. ఇందులో తమన్నా వివాహబంధంతో కొత్త జంటలను కలిపే మ్యాచ్ మేకర్ గా నటిస్తే.. రితేష్ దేశ్ ముఖ్ భార్యాభర్తలకు విడాకులు ఇప్పించే లాయర్ గా కనిపించబోతున్నాడు.
వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమన్నా ప్రముఖ డేటింగ్ యాప్ 'టిండర్ ఇండియా'తో కలిసి 'ప్లాన్ ఎ ప్లాన్ బి' వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఈ వీడియోలో.. కారులో వెళ్తుండగా టిండర్ యాంకర్.. తమన్నాను రెండు ప్రశ్నలు అడుగుతుంది. ప్లాన్-ఎ.. 'ఏ పార్టనర్ లేకుండా ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండాలని ఉందా?' లేక ప్లాన్-బి 'ఏడాది పాటు పర్‌ఫెక్ట్ పార్టనర్‌తో ఉండాలని ఉందా?' అని ప్రశ్నించింది. అందుకు తమన్నా వెంటనే ప్లాన్-బి అని ఆన్సర్ ఇచ్చింది. ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండే కంటే ఏడాది పాటు పర్‌ఫెక్ట్ పార్టనర్‌తో ఉండటమే బెటర్ అంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.