వివాదంపై ట్వింకిల్ ఫన్నీ రియాక్షన్

Update: 2017-10-31 01:30 GMT
ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్.. మల్లికా దువా వివాదం హాట్ హాట్ గానే నడుస్తోంది. మల్లికా జీ మీరు గంట మోగించండి.. నేను మిమ్మల్ని మోగిస్తాను.. అంటూ అక్షయ్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతోంది.

ఈ కాంట్రవర్సీపై ఇప్పుడు అఫీషియల్ గా రియాక్ట్ అయింది అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. 'లాఫ్టర్ ఛాలెంజ్ సెట్స్ లో నేను ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అవుతున్నా. బజాయించడం అనే మాట బాగానే వింటూ ఉంటాం. చాలామంది మగవాళ్లు.. ఆడవాళ్లు కూడా ఈ మాట అంటూనే ఉంటారు. ఆఖరికి రెడ్ ఎఫ్ ఎంకు కూడా ట్యాగ్ లైన్ బజాతే రహో అనే ఉంటుంది' అంటూ తన భర్త కామెంట్స్ ను సపోర్ట్ చేసింది ట్వింకిల్ ఖన్నా. మల్లికా దువా తండ్రి ఈ వివాదంలో చాలా గట్టిగానే రియాక్ట్ కాగా.. ట్వింకిల్ ఖన్నా ఇప్పుడీ వివాదంపై తన స్టైల్ లో కొన్ని జోక్స్ పేల్చింది.

అక్షయ్ కుమార్ ఫేవరేట్ కా.. బెల్ గాడీ.. అక్షయ్ కుమార్ మసీదుకు ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు.. ఎందుకంటే తను కొన్ని దువాలు వినాలని అనుకుంటున్నాడు. అంటూ జోక్స్ పేల్చింది ట్వింకిల్ ఖన్నా. ఈ జోకులకు మల్లికా దువా నవ్వులతో రిప్లై ఇవ్వడం విశేషం.
Tags:    

Similar News