ఫస్ట్ లుక్: 'ఐ.ఎన్.జి' తో షాక్ ఇచ్చిన కమెడియన్ ప్రియదర్శి..!

Update: 2021-05-18 07:31 GMT
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి ఓటీటీ వరల్డ్ లోకి వచ్చిన 100% తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ''ఆహా''. కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడంతో పాటుగా డబ్బింగ్ సినిమాలు - ఒరిజినల్స్ - వెబ్ సిరీస్ లు - స్పెషల్ షోలను స్ట్రీమింగ్ కి పెడుతూ వీక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ ఆదరణ పొందుతున్న 'ఆహా' ఓటీటీ.. ఇప్పుడు ''ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'' (ఐ.ఎన్.జి) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని రెడీ చేసింది.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ''ఐ.ఎన్.జి'' సిరీస్ లో కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ తన కామెడీతో నవ్వించిన ప్రియదర్శి.. ఇందులో సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సిరీస్ లో హీరోయిన్ నందినీ రాయ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తిని కలిగించిన మేకర్స్.. తాజాగా 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో గాయాలతో ఉన్న ప్రియదర్శి సిగరెట్ వెలిగించుకుంటూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. నందినీ రాయ్ ఇంటెన్స్ లుక్ లో ఉంది. వెరైటీగా డిజైన్ చేయబడిన ఈ పోస్టర్ సిరీస్ పై ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తోంది.

''ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'' (ఐ.ఎన్.జి) క్రైమ్ థ్రిల్లర్ ని కొత్త దర్శకుడు విద్యాసాగర్ ముత్తుకుమార్ రూపొందిస్తున్నారు. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. వరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రేక్షకులచేంజ్ షాక్ కు గురి చేయనున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది.
Tags:    

Similar News