`కేజీఎఫ్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ జీవితం నవతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో రాణించాలనుకునే వారికి ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. 16 ఏళ్ల వయసులోనే సినిమాలపై పిచ్చితో జేబులో 300 రూపాయలు వేసుకుని కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టేందుకు బయల్దేరాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎగుడుదిగుడు బావులు.. అన్నిటినీ దాటుకుని వెళ్లాడు. నాటి నుంచి స్టార్ గా ఎదిగే వరకూ ఎన్నో ఒడిదుడులకు..అవమానాలు ఎదుర్కున్నారు. తిండి..నిద్ర లేని రాత్రుళ్లు ఎన్నో. ప్రతిరోజూ సినిమా ఆఫీసులు చుట్టూ వేషాల కోసం తిరగడం... సాయంత్రానికి రూమ్ కి చేరుకుని రివ్యూలు చేసుకోవడం... దానికి తోడు ఇంట్లో కుటుంబ సమస్యలు వెంటాడేవి.
ఇరుగు పొరుగు వాళ్లు కొడుకు ఏం చేస్తున్నాడు? అంటే చెప్పుకోలేక తల్లిదండ్రుల ఆవేదన. తండ్రి ఆర్టీసీ లో డ్రైవర్ . తల్లి గృహిణి. ఎవరూ పెద్దగా చదువుకోలేదు. తండ్రి జీతంతోనే ఇల్లు గడవాలి. ఇలా ఒకటేంటి? యశ్ జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. అయినా ఏ రోజు తన సంకల్పాన్ని వదులుకోలేదు. సంకల్పం ముందు కష్టాలన్ని చాలా చిన్నగానే కనిపించాయి. సినిమా నే శ్వాసగా జీవించాడు. ఇప్పుడు అనుభవిస్తోన్న స్టార్ స్టేటస్ వెనుక ఎంతో కష్టం..కృషి..పట్టుదల ఉన్నాయి. అందుకే నేడు పాన్ ఇండియా స్టార్ యశ్ నీరాజనాలు అందుకుంటున్నారు. యశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి దాదాపు రెండు దశాబ్ధాలు పట్టింది.
యశ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం `కేజీఎఫ్` కి కొనసాగింపుగా `కేజీఎఫ్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రసత్తుం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా డిలే అయింది అన్న సంగతి తెలిసిందే.
రెండేళ్లుగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా వెయిటింగ్
పీరియడ్ యాక్షన్ డ్రామా `KGF: చాప్టర్ 2` రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. 2021 దసరా కానుకగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కి వస్తుందని అటుపై కేజీఎఫ్ కూడా రిలీజవుతుందని భావించారు. కానీ ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిక్స్ కాగా కేజీఎఫ్ ని ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేసారు.ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14 న థియేట్రికల్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా ముందుగా ఈ ఏడాది జూలైలో విడుదల కావాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. `KGF: చాప్టర్ 2` ని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ కొత్త విడుదల తేదీని వెల్లడించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు-హిందీ- కన్నడ- తమిళం- మలయాళం లో విడుదలవుతుంది. రెండేళ్లుగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. కానీ ఈ ఏడాదిలో ఆ ఛాన్స్ మిస్సయ్యింది. ఇంకా ఆరేడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సమ్మర్ నాటికి సలార్ ని కూడా పూర్తి చేసి ఏడాది చివరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.