ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పాల్గొన్న సంగతి తెలిసిందే. దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సామ్ సందడి చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో గురువారం రాత్రి నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సామ్ తన కెరీర్ గురించి.. వ్యక్తిగత జీవితం - పెళ్లి - విడాకుల పై స్పందించింది.
సోషల్ మీడియాలో మీ జీవితం గురించి ఎందుకు ఎక్కువగా ఉంచారు? దాని వల్లే మీపై ఎక్కువ ట్రోలింగ్ జరిగిందని అనుకుంటున్నావా? అని కరణ్ ప్రశ్నించగా.. మొదటి నుంచి పారదర్శకంగా ఉండడం వలన నాపై వచ్చిన రూమర్స్ పై ఫిర్యాదు చేయలేకపోయాను అని సమంత చెప్పింది.
'ప్రేక్షకులు ఎప్పుడూ నా జీవితంలో ఒక భాగమే. వాళ్లు నా జీవితంలో చాలా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే నా జీవితం గురించి వాళ్లకు వెల్లడించాను' అని తెలిపింది. ఈ సందర్భంగా “నువ్వు నీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత” అంటూ కరణ్ అడుగుతుండగా.. మధ్యలో అంతరాయం కలిగిస్తూ 'మాజీ భర్త' అని సామ్ చెప్పడం గమనార్హం.
విడాకులు తీసుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ.. అది అంత సామరస్యంగా జరగలేదు. ప్రస్తుతం బాగానే ఉంది. గతంలో కంటే ఎక్కువ బలంగా ఉన్నాను అని సమంత చెప్పింది. విడిపోయిన తరువాత జీవితం చాలా కష్టంగా అనిపించిందని.. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉందని తెలిపింది. గతంలో కంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని పేర్కొంది.
మీ మధ్య ఇంకా ఏవైన హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని అడగ్గా.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది అని సమంత చెప్పింది. దీనిని బట్టి వారు ఇప్పుడు సామరస్యంగా లేరని.. నాగచైతన్య పై ఆమెకు కోపం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు తమ మధ్య పరిస్థితులు సజావుగా లేకపోయినా.. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈక్వేషన్లు అనుకూలించవచ్చని తెలిపింది.
విడిపోయిన తర్వాత భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై సమంత స్పందిస్తూ.. ''నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తలలో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశాను'' అని చెప్పుకొచ్చింది.
"నువ్వు మళ్లీ ప్రేమకు ఓపెన్ గా ఉన్నవా?" అని కరణ్ అడగ్గా "లేదు" అని సామ్ బదులిచ్చింది. 'నా హృదయానికి దారి క్లోజ్ అయింది.. దయచేసి యు-టర్న్ తీసుకోండి' అని సమంత రూత్ ప్రభు ఘాటైన సమాధానం చెప్పింది. అయితే కరణ్ జోహార్ తో కలిసి హాలిడేకి వెళ్లాలనుకుంటున్నానని తెలిపింది.
టాలీవుడ్ లో ‘బిగ్ బాయ్స్ క్లబ్’ నెపోటిజం పై మీ ఆలోచన ఏంటీ? అని కరణ్ అడగ్గా.. సామ్ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. 'నాకు తెలిసి ఆపిల్ నుంచి మరో ఆపిల్ కు భిన్నంగా ఉంటుందని అనుకుంటున్నాను. నేపో కిడ్స్.. నాన్ నెపో కిడ్స్.. ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు, ప్రతిభ కలిగి ఉంటారు. వారికి కూడా సొంతంగా టాలెంట్ ఉంటుంది. ఒక తండ్రి కోచ్ గా ఉన్నప్పుడు అతని కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో అతను పక్కన నిలబడతాడు. అంతేకానీ గేమ్ గెలవడానికి అతను ఏం చేయలేడు' అని చెప్పింది.
నేను నటించిన సినిమాలు ఫెయిల్ అయితే మా అమ్మ నాన్నలకు, సోదరులకు కొందరికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక స్టార్ హీరో పిల్లలు ఫెయిల్ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారిని ఎప్పుడూ ట్రోల్ చేస్తారు.. వారసత్వంతో పోలుస్తారు అని సమంత పేర్కొంది. స్టార్స్ అందరూ గొప్ప నటులని.. గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని తాను అనుకోవడం లేదని.. దైవానుగ్రహంతోపాటు అదృష్టం కూడా ఉండాలని.. మన సక్సెస్ నిర్ణయించేది ప్రేక్షకులే అని చెప్పుకొచ్చింది.
'పుష్ప' చిత్రంలోని 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా' పాటకు అక్షయ్ కుమార్ తో కలిసి సామ్ స్టెప్పులేయడం ఈ ఎపిసోడ్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద సామ్ ఇప్పటి వరకూ వెల్లడించని ఎన్నో విషయాలని 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో బయటపెట్టిందని చెప్పాలి. అయితే ఎక్కడా తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య పేరు ప్రస్తావించకుండానే చెప్పాల్సిందంతా చెప్పేయడం గమనార్హం.