అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా సెన్షేషన్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పుష్ప హిందీ వర్షన్ వంద కోట్ల వసూళ్లు దక్కించుకుని ప్రతి ఒక్కరు నోరు తెరిచే విధంగా చేసింది. అక్కడ పది పదిహేను కోట్లు రాబట్టడం గొప్ప విషయం అనుకుని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయలేదు. కాని అనూహ్యంగా పుష్ప సినిమా వంద కోట్లకు పైగా రాబట్టింది.
దాంతో పుష్ప 2 విషయంలో దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా పుష్ప 2 ను భారీగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేశారు అనే టాక్ వినిపిస్తుంది. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే పుష్ప 2 సినిమా ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
మార్చి లోనే సినిమా ను పట్టాలెక్కించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకోవడంతో ఏప్రిల్ రెండవ వారంలో షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ లో కూడా షూటింగ్ ఉండదు అని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కాని మాకు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఏప్రిల్ 2వ వారంకు పుష్ప 2 ను పట్టాలెక్కించబోతున్నాడు.
సుకుమార్ ఈ సినిమాను ఎక్కువ సమయం తీసుకోకుండా జెట్ స్పీడ్ లో పూర్తి చేసేలా స్క్రిప్ట్ వర్క్ చేశారట. పైగా ఈ సినిమా సీక్వెల్ కనుక ముందస్తు ప్లాన్స్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీగా చేయాల్సిన అవసరం లేదు. అందుకే సినిమా ను నాలుగు అయిదు నెలల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
సుకుమార్ పుష్ప 2 సినిమా ను కాస్త ఆలస్యంగా మొదలు పెట్టబోతున్నా కూడా ఖచ్చితంగా మొదట ప్రకటించినట్లుగానే డిసెంబర్ 2022 లోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ లుక్ లో కాస్త మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆయన గడ్డం మరియు జుట్టు అలాగే ఉన్నా కాస్త క్లాస్ లుక్ లోకి మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ లో కూలీగా కనిపించిన పుష్ప.. రెండవ పార్ట్ లో స్మగ్లర్ గ్యాంగ్ కు పెద్దగా కనిపించబోతున్నాడు అనేది టాక్. పుష్ప 2 కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.