శివగామి లాంటి పాత్రలా.. కష్టమేనేమో..?
రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన రోజా సెల్వమణి సినిమాల్లో అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమే అంటున్నారు.
ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత రాజకీయ నేత రోజా గత ఐదేళ్లు తన రాజకీయ బాధ్యతలతో బిజీ బిజీగా ఉన్నారు. మినిస్టర్ అయ్యాక ఆమె తనకు ఎంతగానో ఇష్టమైన జబర్దస్త్ ని కూడా వదిలేశారు. ఓ విధంగా రోజా పొలిటికల్ మైలేజ్ కి ఆ షో ఎంతోకొంత హెల్ప్ చేసింది. మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి జబర్దస్త్ షోని 8 ఏళ్ల దాకా రోజా జడ్జిగా వ్యవహరించారు. ఐతే ఇప్పుడు పొలిటికల్ గా కాస్త ఫ్రీగా ఉన్న ఆమె మళ్లీ గ్లామర్ ఫీల్డ్ వైపు అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన రోజా సెల్వమణి సినిమాల్లో అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమే అంటున్నారు. ఐతే ఏదో సినిమాలో ఉన్నాం అంటే ఉన్నాం అన్న పాత్రలు కాకుండా బాహుబలిలో శివగామి, అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రలాగా చేయాలని అనుకుంటున్నా అని తన మనసులో మాట చెప్పారు. అంతేకాదు సినిమాకు ఇంపార్టెంట్ అయిన లాయర్, డాక్టర్ రోల్స్ పైనా తనకు ఆసక్తి ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
రోజా హీరోయిన్ గా సినిమాలు చేయడం ఆపేసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సెకండ్ ఇన్నింగ్స్ గా గోలీమార్, మొగుడు సినిమాల్లో నటించారు. కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రోజాకు అవకాశాలు రాలేదు. ఐతే ఈసారి థర్డ్ ఇన్నింగ్స్ కు సిద్ధం అంటున్న రోజా సినిమాకు బలమైన పాత్రలకు మాత్రమే చేస్తానని అంటుంది. సినిమాలు చేయట్లేదు కాబట్టి ఆమెను తీసుకోవాలని అనుకున్న కొందరు వేరే వాళ్ల ఛాయిస్ కి వెళ్లారు.
ఐతే ఇప్పుడు రోజా సినిమాలు చేస్తా అంటుంది కాబట్టి ఆమెను దృష్టిలో ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఆమె కోరినట్టి శివగామి పాత్ర, అత్తారింటికి దారేది అత్త పాత్రలు రావడం కష్టమేమో కానీ రోజా మార్క్ చాటేలా సినిమాలు వస్తాయని చెప్పొచ్చు. నటిగా మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న రోజాకి అలాంటి ఛాన్సులు వస్తాయా లేదా అన్నది చూడాలి. ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రలు కాదు సినిమాలో కచ్చితంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాల్సిందే అంటున్నారు రోజా. మరి రోజా ఆలోచనని ఎంతమంది దర్శకులు పరిగణనలోకి తీసుకుంటారు. ఆమెకు ఎలాంటి ఛాన్సులు ఇస్తారన్నది చూడాలి.