లైంగిక వేధింపులపై ఐశ్వర్యారాయ్ కామెంట్!
తాజాగా అభిషేక్ బచ్చన్ భార్య, నటి ఐశ్వర్యారాయ్ సమాజంలో జరుగుతోన్న లైంగిక హింసను ఖండించారు.
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం నిరంతరం చర్చకొస్తూనే ఉంటుంది. ఏదో ఒక నటి ఈ అంశంపై మాట్లాడు తుంటారు. లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నా? సినిమా రంగం ఎక్కువగా హైలైట్ అవుతుంద ని..అయితే మిగతా రంగాలతో పొలిస్తే అధికంగా సినిమా రంగంలో ఉంటుందని పలువురు బాలీవుడ్ నటీమణులు అభిప్రాయ పడిన సందర్భాలున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ భార్య, నటి ఐశ్వర్యారాయ్ సమాజంలో జరుగుతోన్న లైంగిక హింసను ఖండించారు.
'సమాజంలో చాలా మంది నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కునేందుకు ధైర్యంగా, సిద్దంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నేరుగా వాళ్ల కళ్లలోకే చూడాలి. మన శరీరం మనకు చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో ఎలాంటి రాజీ పడకండి. నిన్ను నువ్వు కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దు. మీ శక్తిని అలాంటి సమయాల్లో అస్సలు తక్కువగా అంచనా వేయోద్దు' అంటూ చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఐశ్వర్యా రాయ్ వ్యాఖ్యలు మహిళల్లో చైతన్యాన్ని, స్పూర్తిని, శక్తిని నింపుతున్నాయి అంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. ఓ మహిళ ఎంత ధైర్యంగా ఉండాలి? అన్నది ఐశ్యర్య ఎంతో గొప్పగా చెప్పారంటూ ప్రశంశిస్తున్నారు. అయితే ఐశ్వర్యా రాయ్ స్పందించింది మొత్తం సమాజాన్ని ఉద్దేశించి మాత్రమే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఆమె ఎలాంటి కామెంట్ చేయలేదు.
బాలీవుడ్ లో లైంగిక దాడుల గురించి ఇప్పటి వరకూ చాలా మంది స్పందించిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, విద్యా బాలన్ సహా చాలా మది సీనియర్ భామలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇటీవల మలయాళ పరిశ్రమని జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం రేపిన వేళ! ఆ కాక బాలీవుడ్ ని కాస్త కంగారు పెట్టింది.