ప్రభాస్ 'స్పిరిట్'.. వంగా చాలా స్ట్రిక్ట్ గురూ!
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే భారీ బజ్ క్రియేట్ అయింది. దీంతో అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చేతి నిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆ రెండూ 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభాస్ లైనప్ లో కల్కి 2, సలార్ 2, స్పిరిట్ కూడా ఉన్న సంగతి విదితమే. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే భారీ బజ్ క్రియేట్ అయింది. దీంతో అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
కొద్ది నెలలపాటు జరిగిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను వంగా ఇటీవల పూర్తి చేసినట్లు తెలుస్తోంది. డైలాగ్ వెర్షన్ కూడా కంప్లీట్ అయిందని, బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిందని సమాచారం. ఇక షూటింగ్ ను మొదలుపెట్టడమే లేట్ అంట. అందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి.. రెండు నెలల క్రితం నిర్మాత భూషణ్ కుమార్ స్పిరిట్ షూటింగ్ ను జనవరి నుంచి స్టార్ట్ చేస్తామని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అలా ఆలస్యమవుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ బిజీగా ఉండడమే కారణం. రాజా సాబ్, హను రాఘవపూడి సినిమా పూర్తయ్యాక... ఆయన స్పిరిట్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట.
ఇప్పటికే బల్క్ డేట్స్ కేటాయించమని సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ ను కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయన.. షూటింగ్ ను ఒకేసారి పూర్తి చేయాలని సందీప్ రెడ్డి వంగా కోరుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు స్పిరిట్ షూటింగ్ సమయంలో ఇతర చిత్రాల మేకర్స్ తో పని చేయవద్దని డార్లింగ్ ను కోరారని వినికిడి.
ఎందుకంటే స్పిరిట్ లో ప్రభాస్ పోలీసు రోల్ లో కనిపించనున్నారు. నెవ్వర్ బిఫోర్ లుక్ లో సందడి చేయనున్నారు. దీంతో వంగా.. సినిమా కోసం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అదే సమయంలో ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగాకు హామీ ఇచ్చి మే నుంచి షూటింగ్ కు సిద్ధం కావాలని తెలిపారట. అయితే షూటింగ్ 2026 మధ్యలో పూర్తవ్వగా.. ఆ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ కానుందని సమాచారం.