మజాకాలో పవన్ రిఫరెన్సు.. తొలగించిన సెన్సార్ బోర్డు
ఒక సన్నివేశంలో హీరోయిన్ నడుము చూసిన హీరో, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలాంటివి ఎప్పుడో చేసేశారని కామెంట్ చేస్తాడట.
స్టార్ హీరోల ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి మిగిలిన హీరోలు, డైరెక్టర్లు తమ సినిమాల్లో వారికి సంబంధించిన రిఫరెన్సులను వాడుతూ ఉంటారు. తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్ డైలాగులు, ఆయనకు సంబంధించిన రిఫరెన్సులు చాలా మంది చాలా సినిమాల్లో ఇప్పటికే వాడేశారు. తాజాగా ఇప్పుడు సందీప్ కిషన్ కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్సుని వాడుకున్నట్టు తెలిపాడు.
సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా ఎంటర్టైనింగ్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మజాకా. రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మజకా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియా ముందుకొచ్చి మజాకాను తెగ ప్రమోట్ చేసేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లోనే సందీప్ మజాకా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
తమ సినిమాలో పవన్ కళ్యాణ్ పై ఒక డైలాగ్ ఉంటుందని, ఒక సన్నివేశంలో హీరోయిన్ నడుము చూసిన హీరో, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలాంటివి ఎప్పుడో చేసేశారని కామెంట్ చేస్తాడట. ఈ నడుము సీన్ ను ఖుషి రిఫరెన్స్ తో రాసుకున్నామని, కానీ సెన్సార్ బోర్డు ఆ డైలాగ్ ను కట్ చేయించారని సందీప్ కిషన్ తెలిపాడు.
ఏపీ డిప్యూటీ సీఎంపై ఇలాంటి డైలాగ్స్ ఉంటే అభ్యంతరాలు వస్తాయేమోనని సెన్సార్ బోర్డు ఆ డైలాగుని కట్ చేసినట్టు చెప్పిన సందీప్ కిషన్ సినిమాలో ఆ డైలాగ్ ఉంటే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసేవారని, ఆ సీన్ కు నెక్ట్స్ లెవెల్ లో రెస్పాన్స్ వచ్చేదని చెప్తున్నాడు. అది కాకుండా కూడా మజాకాలో చాలా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ఉంటాయని, సందీప్ వెల్లడించాడు.