సీతమ్మ వాకిట్లో.. మరింత స్పెషల్ గా నిలవనుందే!
ఇప్పుడు అలాంటి కోవకు చెందిన మరో సినిమా ఒకటి రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
ఏదైనా స్టార్ హీరోకి సంబంధించిన సినిమా రీ రిలీజ్ అవుతుంటే ఆ హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ల దగ్గర, లోపల అంతా వారి హడావిడే ఉంటుంది. వేరే హీరోల ఫ్యాన్స్ అటువైపు తొంగి కూడా చూడరు. కానీ కొన్ని సినిమాలు మాత్రం వాటికి మినహాయింపు.
పాత, కొత్త సినిమాలతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అందరూ కొన్ని సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. హీరో ఫ్యాన్స్ మధ్య ఉన్న దూరాన్ని కూడా సదరు సినిమాలు దూరం చేస్తాయి. మొన్నామధ్య రిలీజైన మురారి సినిమా రీరిలీజ్ అయినప్పుడు ఇలాంటి రెస్పాన్సే తెచ్చుకుంది.
మురారి మూవీని కేవలం మహేష్ ఫ్యాన్సే కాకుండా మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా చూసి ఆస్వాదించారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన మరో సినిమా ఒకటి రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013లో రిలీజై మంచి హిట్ గా నిలిచింది.
టైమ్ గడుస్తున్న కొద్దీ ఆ సినిమా కల్ట్ స్టేటస్ ను దక్కించుకుంది. మహేష్ ఫ్యాన్సే కాకుండా మిగిలిన వాళ్లు కూడా ఈ సినిమాను ఎంతో ఇష్టపడుతుంటారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన సీన్స్, సోషల్ మీడియాల్లో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలాంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మార్చి 7న రీరిలీజ్ కానుంది.
ఈ సినిమాను ఎప్పట్నుంచో రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతుండగా, ఇన్నాళ్లకు నిర్మాత దిల్ రాజు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ రీ రిలీజ్ విషయంలో మహేష్ అభిమానులే కాకుండా సగటు మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు. ఇందులోని ప్రతీ పాత్ర, సంగీతం, సీన్స్ సినిమాను కల్ట్ సినిమాగా నిలబెట్టాయి. రీరిలీజుల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్పెషల్ గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.