700 కోట్ల‌తో లింగుస్వామి మ‌హాభార‌తం!

అయితే అంత‌కంటే ముందే మ‌హాభార‌తంపై కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి క‌న్ను ప‌డింది. ప‌డ‌ట‌మే కాదు. ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించ‌డానికి ప‌నుల్ని సైతం వేగ‌వంతం చేసిన‌ట్లు ఆయ‌న మాట‌ల్లో క‌నిపిస్తుంది.

Update: 2025-02-23 09:30 GMT

వెండి తెర‌పై మ‌హాభారతాన్ని ఆవిష్క‌రించాల‌ని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మంది దర్శ‌కులు అనుకుంటున్నారు. కానీ ఎవ‌రూ ఆ సాహ‌సం ఇంకా చేయ‌డం లేదు. అందులో రాజ‌మౌళి కూడా ఉన్నారు. మ‌హాభార‌తం అన్న‌ది ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఎప్పుడు చేస్తారు? అన్న‌ది చెప్ప‌లేదు కానీ ద‌ర్శ‌కుడిగా రిటైర్ అయ్యేలోపు మాత్రం క‌చ్చితంగా చేస్తాన‌న్నారు.

అయితే అంత‌కంటే ముందే మ‌హాభార‌తంపై కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి క‌న్ను ప‌డింది. ప‌డ‌ట‌మే కాదు. ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించ‌డానికి ప‌నుల్ని సైతం వేగ‌వంతం చేసిన‌ట్లు ఆయ‌న మాట‌ల్లో క‌నిపిస్తుంది. ఆనంద వికటన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగుస్వామి మ‌హాభార‌తం విష‌యాన్ని రివీల్ చేసాడు. అలాగ‌ని మ‌హాభార‌తం మొత్తం తీయ‌డం లేదు. మ‌హాభార‌తంలో అర్జునుడు-అభిమ‌న్యుల క‌థ‌ని తెర‌పైకి తెస్తున్న‌ట్లు తెలిపారు.

కొన్ని పౌరాణికాల ఆధారంగా...వాటి స్పూర్తితో ముందుకు క‌దులుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ చిత్రాన్ని 700 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొంది స్తున్న‌ట్లు తెలిపారు. అభిమన్యుడు అర్జునుని కుమారుడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు అభిమ‌న్యుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది.

అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు. అటుపై పెద్దల అంగీకారంతో వివాహం అవుతుంది. వివాహానంతరము అస‌లైన యుద్దం మొద‌ల‌వుతుంది. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అభిమ‌న్యుడి పాత్ర ఎంతో గొప్ప గౌర‌వంతో కూడిన‌ది. మ‌రి లింగు స్వామి ఈ క‌థ‌ను ఎంత వ‌ర‌కూ తీసుకుంటున్నాడు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News