బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించి హీరో స్థాయి స్టార్ డంను దక్కించుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఈయన హాలీవుడ్ లో కూడా నటించి ఇండియన్ సినిమాకు గౌరవం తీసుకు వచ్చాడు. విలక్షణ పాత్రలు అనగానే ఠక్కున వినిపించే పేరు.. గుర్తుకు వచ్చే ఫేస్ ఇర్ఫాన్. అంతగా ప్రేక్షకుల్లో ముద్ర పడ్డ ఇర్ఫాన్ ఖాన్ కొన్నాళ్ల క్రితం తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.
క్యాన్సర్ ఎటాక్ అయిన ప్రారంభం లో ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు చేశాడు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లిన ఇర్ఫాన్ గత ఏడాది తిరిగి వచ్చాడు. ఇండియాకు వచ్చిన సమయంలో ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం బాగుందనే అన్నారు. ఆయన ఇండియా కు వచ్చిన కొన్నాళ్లకు ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాను మొదలు పెట్టారు. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా చాలా విలక్షణమైన పాత్రను ఇర్ఫాన్ ఖాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మరియు మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. చాలా ఇంట్రెస్ట్ తో ఈ చిత్రాన్ని చేశాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. అందుకే సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకున్నాను. కాని అందుకు నా శరీరం సహకరించడం లేదు. నా ఆరోగ్యం ఎలా ఉందో నాకే అర్థం అవ్వడం లేదు అన్నట్లుగా సరదాగా కామెంట్స్ చేసి అభిమానులను కన్నీరు పెట్టించాడు.
చికిత్స తర్వాత క్యాన్సర్ నుండి ఇర్ఫాన్ పూర్తిగా తేరుకోలేదని.. అది మళ్లీ ఇప్పుడు తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. ఇర్ఫాన్ ఖాన్ సినిమా ప్రమోషన్స్ లోనే పాల్గొనలేనంతగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. మళ్లీ ఆయన మామూలు మనిషి ఎప్పుడు అయ్యేనో తెలియదు. ఆయన మామూలు మనిషి అయినా కూడా మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రంగా అంగ్రేజి మీడియం నిలుస్తుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.