టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాడ్ అల్లు అరవింద్ తో గొడవపడుతున్నారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ .. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆలోచనలు.. నిర్ణయాలతో విభేధిస్తూ బన్ని స్వతంత్య్ర నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది ఓ వాదన. బన్ని ఈ కొత్త ప్రవర్తన వల్ల డాడ్ అరవింద్ ఇతర హీరోల వైపు మొగ్గు చూపుతున్నారని, మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారమవుతోంది.
బన్ని ఉన్నట్టుండి సుకుమార్ కి ఓకే చెప్పాడు సైలెంటుగా. అదే టైమ్ లో అరవింద్ మహేష్, చరణ్ లకు గాలం వేస్తున్నారు. ఈ సపరేషన్ ఎందుకు? అంటూ ఫిలిం నగర్ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇది గొడవ పడడమా? లేక క్రియేటివ్ డిఫరెన్సెస్ మాత్రమేనని సర్ధి చెప్పుకోవాలా? అన్న కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది. డైలమాతో కూడుకున్న సందిగ్ధత కనిపిస్తోంది అందరిలో.
అయితే ఇది నిజమా? ఇందులో వాస్తవం ఎంత? అంటే అందుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం బన్ని - అరవింద్ గొడవపడుతున్నారని అభిమానుల్లో చర్చ సాగడం వేడెక్కిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా గొడవ పెద్దగానే ఉంది అన్న గుసగుస వినిపిస్తోంది. ఆ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెబ్ మాధ్యమం వార్తను ప్రచురించడంతో దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే అసలు బన్ని అనే ఎనర్జిటిక్ స్టార్ ని అందించిన గ్రేట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ఈ సన్నివేశం ఎదురైంది అంటే అందులో నిజం ఎంత? ఇదంతా కేవలం బిజినెస్ విస్తరణలో భాగమే అని ఎందుకు అనుకోకూడదు? సొంత హీరోతో సినిమాలు చేస్తే ఇతర హీరోలతో చేయరా? అని ప్రశ్నించడం మీడియాకు అలవాటు. అందుకే ఇప్పుడు అరవింద్ ఇతర అగ్ర హీరోలతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు. బన్ని ఇతర బ్యానర్లకు సినిమాలు చేయడం అనేది అందరి బాగు కోసమేనని అనుకోవడం తప్పేమీ కాదు. ఇదంతా బిజినెస్ వ్యూహం అని అనుకోవాలేమో. అయినా గొడవకు, క్రియేటివ్ డిఫరెన్సెస్ కి మధ్య ఉన్న సన్నని సరిహద్దు రేఖను అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో!