వరసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు డిజాస్టర్లు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఇంకో హీరో అయితే ఈపాటికి తట్టాబుట్టా సర్దాల్సిందే. మెగా స్టాంప్ ఉంది కాబట్టి దర్శక నిర్మాతలు ఇంకా వస్తున్నారు. ఇదే సంఖ్యలో ప్లాప్ లు తిన్న మరో యూత్ హీరో ఆఖరికి రెమ్యునరేషన్ లేకుండా హిట్ అయ్యాక డబ్బులు తీసుకునేందుకు ఒప్పుకునే వైనం కూడా ఈ పరిశ్రమలోనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చింది చిత్రలహరి.
వీకెండ్ ని బాగా వాడుకుంటూ సమ్మర్ హాలిడేస్ అడ్వాన్టేజ్ ని తీసుకున్న ఈ మూవీ ఇంకో నాలుగైదు రోజుల్లో పెట్టుబడి పరంగా సేఫ్ అయ్యేలా ఉంది. అయితే తేజు కోరుకున్న బ్రేక్ దక్కిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం సంపూర్ణంగా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే చిత్రలహరి బిజినెస్ 13 కోట్ల లోపే చేశారు. తేజు గతంలో సుప్రీమ్ తో పాతిక కోట్లు రాబట్టగలనని రుజువు చేశాడు. కానీ ఇప్పటి ట్రాక్ రికార్డు సగానికి పైగా ఆ మొత్తాన్ని తగ్గించింది
కాబట్టే చిత్రలహరి ట్రేడ్ లెక్కల్లో సేఫ్ అని చెప్పుకోవచ్చు కానీ ఖచ్చితంగా అతని రేంజ్ హిట్ అయితే కాదు. ఒకవేళ పాతిక కోట్లు రాబడితే అప్పుడు తేజుకి పునర్ వైభవం వచ్చిందని చెప్పొచ్చు. కానీ అంత సీన్ కనిపించడం లేదు. మహా అయితే ఇంకో నాలుగు రోజులు లేదా ఇంకో వీకెండ్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత చిత్రలహరి స్లో కావడం ఖాయం.
అలాంటప్పుడు తేజుకి ఇది చిన్న రిలీఫ్ లాగా పనికొస్తుంది తప్ప ఆశించిన మెగా బ్రేక్ అయితే కాదు. సో ఇంకొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. కాకపోతే ఎడారిలో ఎండుతున్న బాటసారికి కనీసం మంచి నీటిలా పనికి వచ్చింది చిత్రాలహరి. కానీ కోరుకుంటున్న కూల్ డ్రింక్ తాగాలంటే మాత్రం ఈ కంటెంట్ సరిపోదని వసూళ్లు చెబుతున్నాయి