తమిళ స్టార్ హీరో శింబు సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. అతడి ఎఫైర్లు ఎప్పుడూ హాట్ టాపిక్. ఇటీవల శ్రీలంకకు చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ కుమార్తెను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నాడని తమిళ మీడియాలో కథనాలొచ్చాయి. దీనిపై టాలీవుడ్ లోను విస్త్రతంగా చర్చ సాగింది.
ఇక శింబు మరో రకం వివాదంతో ఇప్పుడు హెడ్ లైన్స్ లోకొచ్చాడు. అతడు సుదీర్ఘ గ్యాప్ తరువాత 2021 చివరలో వెంకట్ ప్రభు సైఫై థ్రిల్లర్ 'మనాడు'తో ఘనమైన పునరారంగేట్రం చేసాడు. గత సంవత్సరం గౌతమ్ వాసుదేవ్ మీనన్ గ్యాంగ్ స్టర్ చిత్రం 'వెంధు తానంధు కాడు' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తదుపరి'పాతూ తలా' అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. శింబు స్టార్ కావడంతో తమిళనాడులో ఈ సినిమాపై అంతో ఇంతో అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఇంతలోనే మీడియాలోని ఒక వర్గం శింబూపై రకరకాల పుకార్లకు తెర తీసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ కుమారుడు A.R అమీన్ విస్తృతమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం థాయ్ లాండ్ లో ఉన్నందున రెహమాన్ అందుబాటులో లేరు. కొడుకు శిక్షణను దగ్గరుండి వీక్షించేందుకు రెహమాన్ థాయ్ లాండ్ వెళ్లారని టాక్ వినిపిస్తోంది. దీంతో తన అభిమాన సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ లేకుండా అతను ఈ మూవీ డబ్బింగ్ పూర్తి చేయడానికి నిరాకరిస్తున్నాడని దర్శకుడు ఆరోపించినట్టు కథనాలొచ్చాయి.
ఈ చిత్ర దర్శకుడు ఒబెలి ఎన్ కృష్ణుడు ట్విట్టర్ లో ఈ వివాదం గురించి గట్టిగా స్పష్టం చేశారు. తమ వైఖరిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వేరొక సినిమా షూటింగుకి సంబంధించిన విషయాన్ని శింబుకి ఆపాదించేశారని క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసారు. మా వ్యూహం ప్రకారం మా సినిమా ప్రోమో వీడియోలో శిలంబరసన్ (శింబు) తప్పనిసరిగా ఉంటారు. ఎటువంటి కారణం లేకుండా అతడి పేరును తప్పుడు ప్రచారంలోకి తేవొద్దు. మా నిర్మాత K.E. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంస్థలో నిర్మిస్తున్న 'పాతూ తాలా' ప్రమోషన్ విషయమై స్పష్టమైన ఆలోచనను కలిగి ఉన్నాం. మాకు నచ్చని విధంగా మా మధ్య విధ్వేశాలను రెచ్చగొట్టొద్దు' అని అభ్యర్థించారు. సోదరుడు శింబు డిసెంబరులోనే 'పాతు తలా' షూట్ పూర్తి చేశాడు. మేము నిన్న చిత్రీకరించినది వేరు.. అది గౌతమ్ కార్తీక్ - ప్రియా భవణి శంకర్ లతో ఒక పాటను చిత్రీకరించాం.. ఇది శింబు సినిమాలో ఒక భాగం! అని స్పష్ఠం చేసారు.
'పాతూ తలా' మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచార కార్యకలాపాలు త్వరలో కిక్ స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది. మార్చి లో ఆడియో- టీజర్ సహా ట్రైలర్ ని కూడా లాంచ్ చేయనున్నారని టాక్. మా సినిమా ప్రమోషన్స్ కోసం శింబు తిరిగి వస్తారు.. అని వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే ఇటీవలి కాలం శింబుపై పబ్లిసిటీ స్టంట్ ఎక్కువైంది. ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెస్తూ అతడికి బోలెడంత ఉచిత ప్రచారం చేస్తుండడం బయటపడుతోంది. గత కొంతకాలంగా శ్రీలంకకు చెందిన బిజినెస్ మేన్ కుమార్తెను పెళ్లాడేస్తున్న శింబు! అంటూ మీడియాలో తామరతంపరగా కథనాలు వచ్చినా దానికి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు శింబు సినిమా విడుదల ప్రచారంలో ఉండగా ఇలాంటి అనవసరమైన హంగామాను తెరపైకి తెస్తున్నారు. దీనికి తోడు తన దర్శకుడితో చిత్రబృందంతో శింబు వివాదాలు కొనసాగుతున్నాయని అందుకే అతడు షూటింగులో కనిపించడం లేదని ప్రచారానికి రావడం లేదని రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇదంతా కావాలనే మూవీకి బజ్ తెచ్చేందుకు వాంటెడ్ లీ ప్రచారం చేస్తున్నారా? అన్న సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్ తరహా పీఆర్ స్ట్రాటజీని శింబు కోసం అనుసరిస్తున్నారని ఒక సెక్షన్ మీడియా భావిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.