మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. దబుల్ ఇంపాక్ట్ అంటూ రూపొందిన ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఊవీ మంచి వసూళ్లని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
తొలి రోజు డివైడ్ టాక్ ని దక్కించుకున్న ఈ మూవీ ఓపెనింగ్స్ పరంగా ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ డే రూ. 7 కోట్లకు పైనే వసూళ్లని రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా రోజు రోజుకీ వసూళ్ల పరంగా ఆశ్చర్యపరుస్తోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 32 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ రోజున పెద్దగా పాజిటివ్ టాక్ ని దక్కించుకోని ఈ మూవీ మూడవ రోజుకి భారీ స్థాయిలో పుంజుకుందని చెబుతున్నారు.
ఉన్నట్టుండీ `ధమాకా` వసూళ్లు రైజ్ కావడం.. సినిమాకు భారీ క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం హీరో రవితేజ అని తెలుస్తోంది. గత కొంత కాలంగా రవితేజ తన మార్కు జోష్ వున్న క్యారెక్టర్లతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయలేకపోతున్నాడు. దీంతో ఆయన నటించిన `ఖిలాడీ`, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. అయితే చాలా రోజుల తరువాత రవితేజ తనదైన స్టైల్ లో నటించడంతో `ధామాకా` ఫ్యాన్స్ కి బాగా నచ్చుతోందని తెలుస్తోంది.
ఫ్యాన్స్ తన నుంచి ఈ తరహా సినిమాలే కోరుకుంటున్నారని `ధమాకా` మూవీతో మరో సారి ప్రూవ్ అయిందని, ఇక నుంచి రవితేజ ఫ్యాన్స్ తన నుంచి ఎలాంటి సినిమాలు కావాలని కోరుకుంటున్నారో అలాంటి సినిమాలని అందించేందుకు సిద్ధం కావాలని ఇండస్ట్రీ వర్గాల్లోల వినిపిస్తోంది. మాస్ మసాలా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన `ధమాకా` ఇప్పటి వరకైతే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ జోష్ ని కంటిన్యూ చేస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.