జ‌గ‌న్‌తో భేటీకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ అందుకే వెళ్ల‌లేదా?

Update: 2022-02-11 04:39 GMT
సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులు కొందరు చిరంజీవి నేతృత్వంలో గురువారం.. సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకున్న విష‌యం తెలిసిందే. ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి, బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ప్ర‌భాస్‌.. మ‌హేష్ బాబు, ఆర్‌. నారాయ‌ణ మూర్తి త‌దిత‌రులు.. వ‌చ్చి.. సీఎంతో బేటీ అయ్యారు. అయితే.. సీఎంతో జ‌రిగే బేటీకి జూనియ‌ర్ ఎన్టీఆర్  కూడా వ‌స్తార‌ని.. ఆయ‌న కూడా సీఎం జ‌గ‌న్‌తో ప‌రిశ్ర‌మ‌పై చ‌ర్చిస్తార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

సీఎంతో భేటీకి ఎవ‌రెవ‌రు వ‌స్తారు.. అనే జాబితా సోష‌ల్ మీడియా చ‌క్క‌ర్లు కొట్టింది. దీనిలో చిరంజీవి వెంట జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు వ‌స్తున్నార‌ని ప్రచారం జ‌రిగింది. అనుకున్న‌ట్టుగా వారు వ‌చ్చారు కానీ.. జూనియ‌ర్ మాత్రం ఈ స‌మావేశానికి రాలేదు. అయితే.. వాస్త‌వానికి ఆయ‌న పేరు కూడా జాబితాలోనే ఉంద‌ని.. అయితే.. చివ‌రి నిముషంలో ఆయ‌న త‌న‌ప‌ర్య‌ట‌న‌ను కాన్సిల్ చేసుకున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

దీనికి కార‌ణంపై అనేక వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న క‌నుక‌.. స‌మావేశానికి వ‌స్తే.. వైసీపీకి అనుకూ లంగా ఉన్న‌వాడిగా ముద్ర ప‌డుతుంద‌నే ప్ర‌చారం ఒక‌టి ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని.. భ‌విష్య‌త్తులో ఇది త‌న‌కు ఇబ్బంది అవుతుంది కాబ‌ట్టి.. జూనియ‌ర్ త‌ప్పుకొన్నార‌ని అంటున్నారు. ఎందుకంటే.. జూనియ‌ర్ ను వైసీపీ మ‌నిషిగా.. చిత్రీక‌రించేందుకు ఉన్న అన్ని అవకాశాల‌ను కొంద‌రు వాడుకుంటున్నార‌ని.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాను వెళ్ల‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం అటుంచితే.. డ్యామేజీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. మ‌రో కీల‌క వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది.  జూనియ‌ర్ వెళ్లాల‌నే అనుకున్నార‌ని.. అయితే.. నందమూరి కుటుంబంలోని ఒక‌పెద్ద మ‌నిషి.. ఆయ‌న‌ను అడ్డుకున్నార‌ని.. చివ‌రి నిముషంలో ఫోన్ చేసి.. నువ్వు వెళ్లొద్దు! అని చెప్పార‌ని.. అందుకే జూనియ‌ర్ త‌న ప‌ర్య‌ట‌న‌ను విర‌మించుకున్నార‌ని.. ప్ర‌చారంలోకివ‌చ్చింది. వాస్త‌వానికి జూనియ‌ర్ వ‌స్తే.. ఆ కిక్కు వేరేగా ఉండేద‌ని.. ఆయ‌న అభిమానులు అంటున్నారు.

దీంతో సీఎంతో జ‌రిగే భేటీలో జూనియ‌ర్ వ‌స్తున్నార‌న్న వార్త టాప్ ప్రియార్టీలోకి వెళ్లింది. కానీ, ఇప్పుడు.. జూనియ‌ర్ అనూహ్యంగా విర‌మించుకోవ‌డం.. దీనివెనుక‌.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయ‌ని.. ప్ర‌చారంలోకి రావ‌డం ఆస‌క్తిగా మారింది. 
Tags:    

Similar News