ప్రతీ సినిమాకు నైజాం థియేటర్లు మెయిన్ అన్నది తెలిసిందే. ఎక్కడ థియేటర్లు లబించినా ప్రతీసారి ఇక్కడ మా సినిమాకు థియేటర్లు లభించలేదని, ఇవ్వడం లేదనే పంచాయితీ నడుస్తూ వుంటుంది. పెద్ద సినిమాలకు ఇలాంటి సమస్య ఎప్పుడూ తలెత్తలేదు కానీ డబ్బింగ్ సినిమాలకు కొన్ని సందర్భాల్లో థియేటర్ల సమస్య తలెత్తడం..దానిపై రార్ధాంతం జరగడం తెలిసిందే. 2017లో డబ్బింగ్ సినిమాల విషయంలో ఇదే తరహా రగడ జరగడంతో పండగల వేల తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనని తీసుకొచ్చారు.
అదే ఇప్పుడు నైజాంలో సరికొత్త రచ్చకు తెరలేపుతోంది. 2023 జనవరికి సంక్రాంతి బరిలో భారీ తెలుగు సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. మధ్యలో `కల్యాణం కమనీయం` లాంటి యువీ వారి చిన్న సినిమాలు కూడా పోటీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు అనే లెక్క ఇంకా తేలలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికీ తర్జన భర్జన నడుస్తూనే వుందట.
థియేటర్లు చేతిలో పెట్టుకున్న వారు మిగతా సినిమాలకు అనుకున్న స్థాయిలో కేటాయించకపోవడమే ఇప్పుడు నైజాంలో పెద్ద రచ్చకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి దిల్ రాజు తాను నిర్మిస్తున్న `వారసుడు`ని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు క్రేజీ థియేటర్లని బ్లాక్ చేసుకున్నాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. దీనిపై లెక్క ఇంకా తేలలేదు. ఇదిలా వుంటే ఇదే సంక్రాంతికి మైత్రీ వారు నిర్మిస్తున్న `వాల్తేరు వీరయ్య`, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కానున్నాయి.
వీటి థియేటర్లు ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకు ఏషియన్ వారు యాభై థియేటర్ల జాబితాని మేకర్స్ కి అందించారట. అంతే కాకుండా అందులో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోమన్నారట. ఇది మైత్రీ వారికి నచ్చడం లేదని చెబుతున్నారు. కానీ ఏషియన్ వారి వాదన మరోలా వుంది. ఇక కొన్ని థియేటర్లకు షేరింగ్ అడుతున్నారట. ఆ మాటలు విన్న మైత్రీ వారికి మతిపోతోందని ఇన్ పైడ్ టాక్.
ఇదిలా వుంటే నైజాం లో వున్న మొత్తం స్క్రీన్ లు 600. ఈ థియేటర్లని సమానంగా దిల్ రాజు, మైత్రీవారు పంచుకుంటే ఏ గొడవా వుండదు. కానీ అది ఇంత వరకు జరక్క పోవడంతో థియేటర్ల పేచీ ఇంకా అలాగే పెండింగ్ వుందని, సంక్రాంతి ఫైట్ కి టైమ్ దగ్గరపడుతున్నా థియేటర్ల పంచాయితీ ఇంత వరకు కొలిక్కి రాకపోవడంతో ఈ లెక్క ఎప్పటికి తేలేను అని అంతా చర్చించించుకుంటున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.