టాలీవుడ్ డైరెక్ట‌ర్ల సేఫ్ గేమ్ ఇది!

Update: 2022-11-13 10:30 GMT
ప‌రిశ్ర‌మ‌లో హిట్ కాంబినేష‌న్స్ మాత్ర‌మే  రిపీట్ అవుతుంటాయి. చాలా రేర్ గా ప్లాప్ కాంబోలు జ‌త‌క‌డుతుంటాయి. అందులోనూ డైరెక్ట‌ర్లు చాలా సెల‌క్టివ్ గా ముందుకెళ్తుంటారు. వీలైనంత వ‌ర‌కూ స్టార్ హీరోల్నే లాక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కుద‌ర‌ని ప‌క్షంలో వేరే హీరోల జోలికి వెళ్తారు త‌ప్ప‌! ప్లాప్ హీరో ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌డం మాత్రం చాలా రేర్. ఇది ఇండ‌స్ర్టీలో ఓ ర‌క‌మైన సేఫ్ గేమ్ అనొచ్చు. ఈ ర‌కమైన క‌ల్చ‌ర్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో స‌హ‌జంగా చోటు చేసుకునేదే. ఓసారి ఆకాంబోల‌పై ఓ లుక్ ఏస్తే...

ప్ర‌స్తుతం ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాఈ ఈ కాంబో చేతులు క‌లిపింది. గ‌తంలో  ఇదే క‌ల‌యిక‌లో `అత‌డు` తెర‌కెక్కింది. అది హిట్ అవ్వ‌డంతో మ‌హేష్ మ‌రో ఆలోచ‌న లేకుండా `ఖ‌లేజా`కి ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా వైఫ్య‌లంతో మ‌ళ్లీ మ‌హేష్ మాంత్రికుడు వైపు చూడలేదు.

ఈ క్ర‌మంలో త్రివిక్ర‌మ్ ఇత‌ర హీరోల‌తో సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌డంతో మ‌ళ్లీ మిల్క్ బోయ్ లైన్ లోకి వ‌చ్చారు.  అలాగే `జులాయి`.. `అల వైకుంటపుర‌ములో` తో  తో  బ‌న్నీకి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు ఇవ్వ‌డంతో మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ ఐకాన్ స్టార్ తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. అలాగే మెగా ప‌వ‌ర్  స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ కి `రంగ‌స్థ‌లం`తో   బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన సుకుమార్ కూడా చెర్రీతో మ‌రో సినిమాకి  మంత‌నాలు చేస్తున్న‌ట్లు తెర‌పైకి వ‌స్తుంది.

చెర్రీ పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో సుక్కు ఓ  పాన్ ఇండియా చిత్రాన్నే ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. `జ‌న‌తా గ్యారేజ్` తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి  భారీ విజ‌యాన్ని అందించిన కొర‌టాల శివ  టైగ‌ర్ ల్యాండ్ మార్క్ మూవీ 30 వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో చోటు చేసుకుంటోన్న జాప్యం విధిత‌మే.

హిట్ కంటెంట్ తో రావాల‌నే ద్వ‌యం ప‌క్కా  ప్లానింగ్ తో బ‌రిలోకి దిగుతుంది. అలాగే `గీత‌గొవిందం` తో వంద కోట్ల వ‌సూళ్లు సినిమా అందించిన ప‌రుశురాం మ‌రోసారి రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో  సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే `ఖుషీ` త‌ర్వాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారుట‌.

ఇక బాల‌య్య -బోయ‌పాటి కాంబో గురించి చెప్పాల్సిన  ప‌నిలేదు. బోయ‌పాటి కి బాల‌య్య ఓ డైమండ్ లా దొరికారు. ప్లాప్ వ‌చ్చిన ప్ర‌తీ సారి బాల‌య్య ద‌గ్గ‌ర‌కి వ‌స్తే స‌రి. ఆయ‌నో హిట్ ఇచ్చి బోయ‌పాటిని  పులిలా బ‌య‌ట‌కి పంపుతారు. ఆ మ‌ధ్య `అఖండ‌`తో హిట్ అవ్వ‌డంతో బోయ‌పాటి మ‌ళ్లీ ద‌ర్శ‌కుడిగా బిజీ అయ్యారు. ఇంకా ఇలాంటి కాంబినేష‌న్స్ చాలానే ఉన్నాయి.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News