బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు జగపతిబాబు. ఆ తరవాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వైవిద్యమైన పాత్రలతో దూసుకళ్లిపోతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు.. మళయాళంలో కూడా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్న జగపతిబాబు ఉన్నట్టుండి కొత్త క్యాంపెయిన్ మొదలెట్టాడు. చిన్న సినిమాలకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్నాడు. ఈమధ్య విశాఖపట్నం బీచ్ రోడ్డులో హఠాత్తుగా ప్రత్యక్షమై జనాలతో కలిసి నడుచుకుంటూ వెళ్లాడు . తాజాగా విజయవాడ లో ఫుల్ రష్ గా ఉండే కాళేశ్వరరావు మార్కెట్ ఏరియాలో పాదయాత్ర చేశాడు. ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరో హీరోయిన్లను ప్రోత్సహించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. చిన్న సినిమాలు అంతరించిపోకుండా విజయాలు సాధించాలన్న కోరికతో నడుస్తున్నానని చెప్పుకొచ్చాడు. తెల్లచొక్కా.. తెల్లపంచె ధరించి రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్తున్న జగపతిబాబును చూసిన అభిమానులంతా ఆయన వెంట పరుగులు తీశారు.
వీధుల్లో నడవడానికి.. చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి మధ్య కనెక్షన్ ఏంటన్నది జగపతిబాబు క్లారిటీగా చెప్పలేదు. హైదరాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని.. ఆ తరవాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెబుతానని అంటున్నాడు. సాధారణంగా ఈ పాదయాత్రలు అవీ పొలిటికల్ పీపుల్ కు అలవాటు. పాలిటిక్స్ దూరంగానే ఉండే జగపతిబాబు రాజకీయ నాయకుల స్టయిల్ లో మాట్లాడుతున్నాండేటి చెప్మా?