గత కొంతకాలంగా అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఇమేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో అసాధారణంగా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఇక జాన్వీ అన్ లిమిటెడ్ గ్లామర్ షోకి ఫిదా కాని నెటిజనులు లేనే లేరు. ఇంతకుముందు దుబాయ్ ఎడారి నుంచి అదిరిపోయే ఫోజులిచ్చిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. జాన్వీ - ఖుషీ కపూర్ సిస్టర్స్ బోల్డ్ ఫోటోషూట్లు వైరల్ అయ్యాయి.
తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో జాన్వీ కపూర్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇది నైట్ ఫోటోషూట్. ఇందులో బ్లాక్ కలర్ ఫ్లోరిష్ బికినీతో జాన్వీ అగ్గి రాజేసింది. ఇన్ స్టాలో ఫోటోలతో పాటు ఓ వీడియోని షేర్ చేసిన జాన్వీ దానికి లుంగీ డ్యాన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
నైట్ ఎఫెక్ట్ లో ఎఫెక్టివ్ ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్ తనపై నీళ్లు చల్లుతుంటే జాన్వీ గంతులేస్తోంది. ఆ గంతులనే లుంగీ డ్యాన్స్ అంటూ సంబరపడుతోంది జాన్వీ. మొత్తానికి ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో యువతరాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. జోరుగా షేర్ అవుతోంది. జాన్వీ తదుపరి దోస్తానా 2 సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన చిత్రం గుడ్ లక్ జెర్రీ షూటింగ్ ను జాన్వీ పూర్తి చేసింది. ఈ వార్తను తన అభిమానులతో పంచుకోవడానికి ఆమె ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మలయాళంలో విజయవంతమైన హెలెన్ రీమేక్ ను ఆగస్టులో ప్రారంభించిన సంగతి విధితమే.