టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా ఆసాధారణ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి నటుడిగా అతడికి గాళ్స్ లో గొప్ప క్రేజ్ ఏర్పడింది. అతడు ఊ అనాలే కానీ పెళ్లాడేందుకు యువకథానాయికలు సెలబ్రిటీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. దేవరకొండపై క్రష్ ఉందంటూ జాన్వీకపూర్- సారా అలీఖాన్ - కియరా అద్వాణీ లాంటి భామలు ఇంతకుముందే వ్యాఖ్యానించారు.
అయితే విజయ్ ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నాడని కూడా జాన్వీ- సారా పలుమార్లు హింట్లు కూడా ఇచ్చారు. అతడు రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నాడని ఇప్పటికే పుకార్లు ఉన్నాయి. దీనిని జాన్వీ - సారా కూడా నమ్ముతున్నారు.
తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ విజయ్ చాలా ప్రాక్టికల్ గా పెళ్లాడేశాడు! అని వ్యాఖ్యానించింది. జాన్వీని తన 'స్వయంవర్' కోసం మూడు పేర్లను ఎంచుకోమని హోస్ట్ అడిగారు. ఆమె హృతిక్- రణబీర్ - టైగర్ అని మూడు పేర్లు చెప్పారు. అయితే పెళ్లయిన రణబీర్ పేరును చెప్పడం వెనక లాజిక్ ఉంది సరే... ఆల్రెడీ భార్యకు విడాకులిచ్చి వేరొక నటితో ప్రేమలో ఉన్న హృతిక్ పేరును జాన్వీ ఎందుకు చెప్పింది? టైగర్ అన్న సమాధానం సరికాదు.. అదే క్రమంలో హోస్ట్ జాన్వీకి విజయ్ దేవరకొండ పేరును సూచించారు. దానికి వెంటనే స్పందించిన జాన్వీ 'అతను ఆచరణాత్మకంగా వివాహం చేసుకున్నాడు' అని వ్యాఖ్యానించింది.
దీనర్థం విజయ్- రష్మిక డేటింగ్ ని జాన్వీ కన్ఫామ్ చేసిందనే. ఈ జంట స్నేహం ప్రేమ వ్యవహారంపై జాన్వీ .. సారా చాలా స్పష్టమైన హింట్లు ఇచ్చారు. ఇప్పటికీ దానిని నమ్ముతున్నారు. జాన్వీ తాజా కామెంట్ చూశాక ఆ వార్తకు మరింత బలం చేకూరింది.
ఇటీవల విజయ్.. రష్మిక ఒకే సమయంలో మాల్దీవుల వెకేషన్ కి వెళ్లడం రకరకాల సందేహాలకు తావిచ్చింది. కానీ ఇప్పటివరకూ ఆ ఇద్దరూ డేటింగ్ వ్యవహారాన్ని అంగీకరించలేదు. విజయ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని రష్మిక చెప్పగా.. పబ్లిక్ ఫిగర్ కావడం వల్ల జరిగిన నష్టం మాత్రమేనని దేవరకొండ వ్యాఖ్యానించారు. మనల్ని ఆరాధించే ప్రజలు మరింత తెలుసుకోవాలనుకుంటారు. మా జీవితంలో జరిగే ప్రతిదానిపై ఆసక్తి కలిగి ఉంటారు. ఇలాంటి డేటింగ్ పుకార్లతో నాకు సమస్య లేదు! అని కూడా దేవరకొండ వ్యాఖ్యానించారు.
జాన్వీ ప్రస్తుతం వరుస రిలీజ్ లతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తదపరి టాలీవుడ్ ఆరంగేట్రం కోసం వేచి చూస్తోంది. ఇక్కడ విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ వస్తే నటించేందుకు సిద్ధమే. అలాగే రామ్ చరణ్- ఎన్టీఆర్ లాంటి స్టార్ల సరసన నటించే అవకాశం వస్తే విడిచిపెట్టనని కూడా జాన్వీ ఇంతకుముందు వెల్లడించింది. ఈ భామ నటించిన మిలీ త్వరలో విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.