ఫెమినా కవ‌ర్ పేజీ పై జాన్వీ ధ‌గ‌ధ‌గ‌లు

Update: 2022-01-11 02:30 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీక‌పూర్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిన‌దే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స‌త్తా చాటుతోంది. అలాగే ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ లోనూ జాన్వీ హైట్స్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు డిజైన‌ర్ లుక్ తో మంట‌లు రేపడం ఈ హాట్ గాళ్ హాబీ. తాజాగా బ్యూటీ మ‌రోసారి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆక‌ట్టుకుంటోంది. ఫెమినా క‌వ‌ర్ పేజీ కోసం డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ ఇచ్చిన  ఫోజులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఒక యాంగిల్ లో షోల్డ‌ర్ లెస్  పూల గౌను ధ‌రించి ఫోజులివ్వ‌గా.. బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో  స్టాండింగ్ లో మ‌రికొన్ని ఫోజులిచ్చింది.  ఫోటోషూట్ ప్ర‌తి స్టిల్ లో జాన్వీ గ్లామ‌ర్ షో వైవిధ్యంగా హైలైట్ అయింది.  ఈ ఫోటోలిప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అభిమానులు త‌మ‌దైన శైలి కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు.

ఇక జాన్వీ  సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో  `దోస్తానా-2` లో  న‌టిస్తోంది. అదే బ్యాన‌ర్ లో మ‌రో రెండు చిత్రాలు క‌మిట్ అయింది. అలాగే అమ్మ‌డు న‌టించిన `గుడ్ ల‌క్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.

`మిలీ` అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక ద‌క్షిణాదిన ఎంట్రీ ఇవ్వ‌డానికి జాన్వీ ఆస‌క్తిగానే ఉంది. కానీ స‌రైన ప్రాజెక్ట్  కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోవ‌డానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. త‌ల్లి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.
Tags:    

Similar News