శ్రీను వైట్ల సినిమా అంటే హీరో కంటే కూడా బ్రహ్మానందం పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఢీ - రెడీ - కింగ్ - దూకుడు లాంటి సినిమాల్లో బ్రహ్మి పాత్రలు ఏ రేంజిలో పేలాయో తెలిసిన సంగతే. ఐతే శ్రీను వైట్ల గత సినిమా ‘దూకుడు’లో మాత్రం బ్రహ్మి క్యారెక్టర్ పండలేదు. పైగా బ్రహ్మి లేకుండా వైట్ల సినిమా చేయలేడు.. బ్రహ్మికి ఒకే తరహా పాత్రలే చేయిస్తాడు.. అన్న అభిప్రాయం కూడా జనాల్లో ఉండటంతో ఈసారి రూటు మారుస్తున్నాడీ స్టార్ డైరెక్టర్. వైట్ల కొత్త సినిమాలో బ్రహ్మి లేడు, బకరా పాత్ర కూడా లేదు. ఈసారి కొత్త తరహా కామెడీతో జనాల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నాడట వైట్ల.
బ్రహ్మి కాకుండా ఇంకో కమెడియన్ ఎవరైనా నవ్వించే బాధ్యత తీసుకోవాలిగా.. మరి ఆ భారం మోయబోయే నటుడు ఎవరా అని ఆరా తీస్తే జయప్రకాష్ రెడ్డి అని తెలిసిందే. విలన్ రోల్స్ నుంచి కామెడీ పాత్రలకు మారిన జయప్రకాష్ రెడ్డి నాయక్ - కిక్ లాంటి సినిమాల్లో పేలిపోయే కామెడీ చేశాడు. ఆయన్నిప్పుడు వైట్ల ఫుల్లుగా వాడేసుకోవడానికి రెడీ అయ్యాడ. జేపీ పాత్రను చాలా స్పెషల్ గా తీర్చిదిద్దాడని.. అది బ్రహ్మి క్యారెక్టర్లలాగే పండుతుందని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు వైట్ల. రషెస్ చూసిన వాళ్లు కూడా జేపీ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారట. చూద్దాం.. ఆ క్యారెక్టర్ లో అంత ప్రత్యేకత ఏముందో!