శ్రీదేవి కోసం 12ఏళ్లు..ఏడ్చేసిన బోనీ-జాహ్నవి

Update: 2018-08-14 14:54 GMT
అతిలోక సుందరి - బాలీవుడ్ అందాల తార శ్రీదేవి చనిపోయి ఏడాది అయ్యింది. ఆమె తొలి జయంతి వేడుకలను ఢిల్లీలోని సమాచార - ప్రసార మంత్రిత్వశాఖ ఫిల్మ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీదేవి నటించిన మామ్ - లమ్హే - ఇంగ్లిష్ వింగ్లీష్ - చాందిని సద్మా లాంటి చిత్రాలను ప్రదర్శించారు. ఈ సినిమాలు చూసిన శ్రీదేవి భర్త బోనికపూర్ - కూతురు జాహ్నవి కన్నీళ్లు పెట్టుకున్నారు.

షో ముగిశాక బోనీకపూర్ మాట్లాడుతూ ‘శ్రీదేవి ప్రేమ కోసం చాలా కష్టపడ్డానని.. దాదాపు 12 సంవత్సరాలు ఓపికగా ఎదురుచూశానని ’ ఉద్వేగంగా అన్నారు. ‘‘శ్రీదేవి బాలీవుడ్ హీరోయిన్ గా ఫేమస్ అయినప్పుడు ఆమెతో ప్రేమలో పడిపోయాను. నాది అప్పుడు వన్ సైట్ లవ్.. కానీ ఆమె మనసు గెలుచుకోవడం కోసం చాలా కాలం ఎదురుచూశాను. పన్నెండేళ్ల తర్వాత నా కోరిక తీరింది’’ అని చెప్పుకొచ్చాడు. శ్రీదేవి నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నానని బోనీ తెలిపాడు.

ఇక నా మొదటి భార్య పిల్లలు కూడా శ్రీదేవి చనిపోయాక ఒక్కటయ్యారని.. శ్రీదేవి పిల్లలను చేరదీశారని బోనీకపూర్ తెలిపారు.  నాకు ఇప్పుడు నలుగురు పిల్లలు అని.. వారే నా బలం అని బోనీ వివరించాడు. ఇక ఈ సినిమా షో పూర్తయ్యాక అమ్మ శ్రీదేవి జ్ఞాపకాలతో కూతురు జాహ్నవి కంటతడి పెట్టింది. గుక్కపట్టి ఏడ్వడం కార్యక్రమానికి వచ్చిన వారందరినీ కలిచివేసింది.
Tags:    

Similar News