2018లో ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ తన కెరీర్ రెండో సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. తనని తెరకు పరిచయం చేసిన గ్రేట్ దర్శకనిర్మాత.. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. తక్త్ అనేది టైటిల్. సింహాసనం (రాజ్యాన్ని) దక్కించుకునేందుకు పోరాడే అన్నదమ్ముల కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 2019-20 మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ మూవీగా తక్త్ గురించి ప్రచారం సాగుతోంది.
అదంతా అటుంచితే జాన్వీ ఈ గ్యాప్ లో నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ బాడీని షేపప్ చేస్తోంది. రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా అందరి మనసులు దోచేస్తోంది. అయితే జాన్వీ జిమ్ కి వెళ్లే టైమ్ కి ప్రతిరోజూ మీడియా ఓ కంట కనిపెడుతూ తన ఫోటోల్ని జోరుగా వైరల్ చేస్తోంది. అలా ఇదివరకూ జాన్వీ జిమ్ వేర్ .. టైట్ ఫిట్ డ్రెస్ లను హైలైట్ చేస్తూ బాలీవుడ్ మీడియా టీఆర్ పీ గేమ్ ఆడిన సంగతి తెలిసిందే. లేటెస్టుగా మరోసారి జాన్వీ జిమ్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కింది.
22 ఏళ్ల జాన్వీ జిమ్ వేర్ లో కట్టి పడేస్తోంది! అంటూ కొన్ని ఫోటోలు మీడియా కథనాల్లో హైలైట్ అయ్యాయి. జాన్వీ పింక్ టీస్.. టైట్ ఫిట్ బ్లాక్ బాటమ్ తో కనిపించింది. పైగా మెడలో తగిలించిన ఖరీదైన వ్యాలెట్ .. రెండు చేతుల్లో రెండు ఫోన్లు పట్టుకుని వెళుతోంది. ఓ చేత్తో ఫోన్ మాట్లాడుతూ రెండో చేతిలోని ఫోన్ ని ఓపెన్ చేస్తోంది. ఆ క్రమంలోనే రెండో ఫోన్ లో వాల్ పేపర్ వీక్షకుల కళ్లను కట్టి పడేసింది. ఇంతకీ ఆ వాల్ పేపర్ లో ఉన్నది ఎవరు? అంటే అతిలోక సుందరి శ్రీదేవి- బోనీ కపూర్ యంగ్ కపుల్ గా ఉన్నప్పటి ఫోటో. శ్రీదేవి - బోనీ జంట ఏదో వెకేషన్ లో మాంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. ఇద్దరూ పూర్తి బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం మామ్ అభిమానుల్లో ఆ ఫోటో గురించే ఆసక్తికర చర్చ సాగుతోంది.