డబ్బు విలువ తెలిసిన దాన్ని..అందుకే అలా!
అయితే భార్యమణి వితికషేరు మాత్రం డబ్బు విషయంలో గొప్ప జాగ్రత్త పరురాలు అని తెలుస్తోంది.
భీమవరం బ్యూటీ వితిక షేరు -వరుణ్ సందేశ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వితిక సిని మాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటుంది. భర్త వరుణ్ తో నూ అప్పు డప్పుడు కనిపిస్తుంది. కానీ వరుణ్ మాత్రం ఇంకా సినిమాలు వదల్లేదు. పెళ్లి తర్వాత కొంత బ్రేక్ వచ్చినా? అడపా దడపా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే భార్యమణి వితికషేరు మాత్రం డబ్బు విషయంలో గొప్ప జాగ్రత్త పరురాలు అని తెలుస్తోంది.
చేతిలో డబ్బులున్నాయని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అమ్మాయిని కాదంటుంది. తాను డబ్బు విలువ తెలిసిన మహిళగా పేర్కొంది. ఏదైనా బ్రాండెడ్ వస్తువు కొనాలంటే? చూసిన వెంటనే దాన్ని కొనేయాలి అనే ఆత్రం ఎంత మాత్రం ఉండదట. కొనాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఒకటికి రెండ సార్లు ఆలోచించి ఆ వస్తువును కొంటుందిట. సాధారణంగా సెలబ్రిటీ లైఫ్ లో డబ్బు విచ్చల విడిగా ఖర్చు అవుతుంది. లెక్కా పత్రం లేకుండా ఖర్చు చేసే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.
సమాజ సేవకు అంటే ముందుకు రారు గానీ...తమ వ్యక్తిగత దుబారా ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. నిర్మాత దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. రూపాయి తగ్గినా సినిమా చేయనని నిర్మొహ మాటంగా చెప్పే స్తారు. కొంత మంది హీరోయిన్లకు అయితే డబ్బు చేతిలో పడితే చాలు అన్నట్లు ఉంటారు. ఏ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నామో తెలియకుండానే హాజరవుతుంటారు.
ఇటీవలే నిర్మాత బెల్లంకొండ సురేష్ వ్యాఖ్యలతోనే ఈ సంగతి బయటకు వచ్చింది. తమకు రావాల్సిన డబ్బు విషయంలో హీరోయిన్లు ఎంత కఠినంగా ఉంటారు? అన్నది ఆయన మాటల్లోనే అర్దమైంది. కానీ తెలుగు నటి వితిక షేరు మాత్రం దుబారా ఖర్చులు చేయని నటిగా తెలుస్తుంది. అలాగైతే వరుణ్ తేజ్ కి పెద్దగా ఖర్చు కూడా ఉండదు కదా.