అంజలి న్యూ లుక్: గ్లామరస్ కిల్లర్

ఈ ఫోటోలకు "క్యాచ్ ది వైబ్" అంటూ క్యాప్షన్ ఇచ్చిన అంజలి, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2025-02-23 02:30 GMT

టాలీవుడ్ అందాల తార అంజలి మరోసారి తన గ్లామర్ లుక్ తో నెట్టింట హీటెక్కించింది. సినిమాల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి, తాజాగా తన స్టన్నింగ్ ఫోటోషూట్ తో ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అంజలి చూపించిన గ్లామరస్ లుక్ అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.

 

ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో అంజలి నీలిరంగపు డిజైనర్ బ్రా అలాగే డీప్ స్లిట్ గల డ్రెస్‌లో కనిపిస్తూ తన అందాన్ని మరింత హైలైట్ చేసింది. స్టైలిష్ వేర్‌లో కనిపించిన ఆమె, మాస్ క్లాస్ ప్రేక్షకులను ఒకేసారి ఆకర్షించగలిగే విధంగా తన హావభావాలను ప్రదర్శించింది. ఆమె కళ్ళలో కనిపించే భావాలు, సింపుల్ మెక్అప్ కర్లీ హెయిర్ స్టైల్ ఆమె లుక్‌కు మరింత గ్లామర్‌ని జోడించాయి.

 

ఈ ఫోటోలకు "క్యాచ్ ది వైబ్" అంటూ క్యాప్షన్ ఇచ్చిన అంజలి, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ స్టైలిస్ట్ మనోగ్న గోల్లపూడి ఈ లుక్‌కు స్టైలింగ్ చేయగా, ఆహిలా ఖాన్ డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌లో ఆమె మరింత అందంగా కనిపించింది. జ్యువెల్స్ ఎంపిక, లైట్ మేకప్ ఆమెను ఒక అందమైన డివా లా మార్చేశాయి.

అంజలి నటనా పరంగా సినిమాలు తగ్గించినా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందం, స్టైల్ తో ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తోంది. ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమాతో ఫ్యాన్స్‌ను అలరించిన ఆమె, వెబ్ సిరీస్‌లలోనూ తళుక్కు మంటోంది. ఈ తాజా ఫోటోషూట్, ఆమెను మరోసారి ట్రెండింగ్‌లోకి తెచ్చింది. ఈ లుక్స్‌తో అంజలి, ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడమే కాదు, ఆమెకు ఇంకా ఎన్నో బిగ్ ఆఫర్లు వచ్చేలా చేస్తోంది. మరి, ఈ గ్లామర్ డోస్ తర్వాత అంజలి బిగ్ స్క్రీన్‌పై మళ్లీ స్టన్నింగ్ ఎంట్రీ ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News