ముంబైలో జిమ్ కి వెళ్లిన‌ జాన్వీయేనా?

Update: 2019-12-16 16:12 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌లే కాశీ-వార‌ణాశి విజిట్ కి వెళ్లి అక్క‌డ సాధువులు నివ‌శించే కాటేజీలో వారం పాటు ఎలాంటి సెల‌బ్రిటీ భేష‌జానికి తావివ్వ‌కుండా స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత‌త‌కు నిల‌య‌మైన‌ ధార్మిక ప్ర‌దేశంలో ఒక సామాన్యుడిలా భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అక్క‌డ స‌మ‌యాన్ని గడిపారు. ప‌విత్ర గంగ‌లో స్నానాదులు ఆచ‌రించి కాశీ విశ్వ‌నాథునికి పూజ‌లాచరించారు.

ర‌జ‌నీ కాంత్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్లు కాశీ-వార‌ణాసి వంటి ధార్మిక ప్ర‌దేశాల‌కు విజిట్ చేయ‌డం స‌హ‌జ‌మే కానీ.. అక్క‌డ కుర్ర బ్యూటీ జాన్వీ క‌పూర్ ఏం చేస్తోంది?  అనేదే అంద‌రిలో సందేహం. అందాల జాన్వీ క‌పూర్ త‌న స్నేహితుల‌తో క‌లిసి వార‌ణాశికి వెళ్లింది. అక్క‌డ ఎంతో ప్ర‌శాంత చిత్తంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స‌మ‌యాన్ని గ‌డిపింది. ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌కు షేర్ చేసింది.

అయితే ఎంచుకున్న ప్ర‌దేశాన్ని బ‌ట్టి డ్రెస్ కోడ్ - మేక‌ప్ ఉండాలి! అన్న నియ‌మాన్ని ఈ యంగ్ బ్యూటీ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో పాటించింది. ఫ‌క్తు సాంప్ర‌దాయ బ‌ద్ధంగా అక్కడ క‌నిపించింది. ఇక ముంబై బాంద్రాలో జిమ్ కి వెళ్లిన జాన్వీయేనా.. ఇక్క‌డ ఇంత ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తోంది! అంటూ కుర్రాళ్లు కామెంట్లు రువ్వుతున్నారు ఈ ఫోటోలు చూశాక‌.


Tags:    

Similar News