మామూలుగానే కాజల్ అగర్వాల్ అంటే బాగా కమర్షియల్ అనే టాక్ ఉంది. హీరో ఎవరైనా కూడా.. కథలో తన రోల్ ఎలా ఉన్నా కూడా.. కాస్త ఎక్సపోజింగ్ తో కూడా గ్లామ్ లుక్ లో నటించాలంటే.. అమ్మడికి 2 కోట్లు ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే సినిమా ఒప్పుకుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలను అమ్మడు వదులుకోవడానికి కేవలం ఆమె రెమ్యునరేషన్ పట్టింపే కారణమని చెబుతుంటారు.
తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. అమ్మడు ట్విట్టర్ లోకి రావడానికి కూడా డబ్బులు వసూలు చేసిందట. ఇన్నాళ్ళూ కేవలం ఫేస్ బుక్కులో సందడి చేస్తున్న కాజల్.. ఇప్పుడు సొంత ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చీ రాగానే బ్రహ్మోత్సవం సినిమా పోస్టర్ ను ట్వీట్ చేసి.. ఆ సినిమా గురించి చెప్పింది. రూమర్ ఏంటంటే.. ట్విట్టర్ లోకి అడుగుపెట్టి బ్రహ్మోత్సవాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు నిర్మాత పివిపి దగ్గర అమ్మడు బాగానే వసూలు చేసిందట. ఇది మరీ టూ మచ్ కదూ.
అయితే ఇది రూమరేనా లేకపోతే నిజమా అనే విషయం మనం చెప్పలేం కాని.. ఈ మధ్యన ట్విట్టర్ లో వివిధ ప్రాడక్టులను ప్రమోట్ చేయడానికి తమన్నా.. తాప్సీ.. వంటి హీరోయిన్లు డబ్బులు తీసుకునే ట్వీట్లు వేస్తున్నారు. సో.. కాజల్ తీసుకుంటే తప్పేముందిలే అంటున్నారు ఆమె అభిమానులు.