మెగాస్టార్ 2 కోట్లు ఇచ్చుంటారా?

Update: 2016-08-07 05:51 GMT
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైద్రాబాద్ పరిసరాల్లోనే ప్రధాన సన్నివేశాలన్నిటినీ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా న్యూస్ ఛానల్స్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఈ సీన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు కూడా. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఫైనలైజ్ చేశారన్నది పాత సంగతే. మరి  ఇందుకోసం మెగాస్టార్ కి ఎంతిచ్చారన్నదే ఇప్పుడు అసలు పాయింట్.

మెగాస్టార్ 150వ సినిమాలో నటించేందుకు కాజల్ కు 2 కోట్ల రూపాయలు ముట్టచెప్పారన్నది టాలీవుడ్ టాక్. వాస్తవానికి కాజల్ రెమ్యూనరేషన్ అంత ఉండదు. 1.25 కోట్లకు కొంచెం అటూ ఇటూగా పుచ్చుకుంటుందంతే. ప్రస్తుతం కాజల్ టైమ్ అంత గొప్పగా లేదు. రీసెంట్ గా సర్దార్ - బ్రహ్మోత్సవంలతో కలిపి హ్యాట్రిక్ డిజాస్టర్స్ చవి చూసింది. ఇలాంటి టైమ్ లో కాజల్ కి 2 కోట్లు అంటే చాలా ఎక్కువ. అయితే.. 2 కోట్లు ఈమెకు ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది.

ఇందుకు కారణం.. సాధారణంగా కాజల్ ఒక సినిమాకి కేటాయించే డేట్స్ కి రెట్టింపు అడిగాడట వినాయక్. అంటే రెండు సినిమాలకు ఇచ్చే డేట్స్ ను బ్లాక్ చేసుకునేందుకే ఇలా భారీ మొత్తం ముట్టచెప్పారని తెలుస్తోంది. ఎక్కువగా డేట్స్ అడిగినా.. చిరంజీవితో చేసే ఛాన్స్ వదులుకోకూడదనే ఉద్దేశ్యంతోనే పారితోషికం విషయంలో రాజీ పడిందని టాక్.

Tags:    

Similar News