తమిళ్ హిట్ మూవీ బోగన్ ను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే హీరోయిన్ గా కేథరిన్ థ్రెసాను ఫైనల్ చేశారనే న్యూస్ కూడా వచ్చింది. రాజా ది గ్రేట్ మూవీ రిలీజ్ తర్వాత.. ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే.. ఇక మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రమే బ్యాలెన్స్ అనుకుంటున్న తరుణంలోనే.. కొత్త ట్విస్ట్ వచ్చింది.
ఈ మూవీలో హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసా ను తప్పించి.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే హీరోతో చర్చలు నిర్వహించడం.. కాజల్ తో సంప్రదింపులు జరపడం కూడా ప్రారంభించారట. కేథరిన్ ను తప్పించడానికి రీజన్ ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే.. ఈ సినిమా రేంజ్ ను మరింతగా పెంచేందుకు.. స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పైగా కాజల్ ఈ మధ్య మాంచి ఫాంలో ఉంది. జనతా గ్యారేజ్ లో అమ్మడు నటించిన సింగిల్ సాంగ్ కే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత.. మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150 అంటూ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేసింది.
రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి అంటూ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి సక్సెస్ కూడా సాధించి.. హ్యాట్రిక్ భామ అయిపోయింది. ఇలాంటి సిట్యుయేషన్ లో కాజల్ లాంటి స్టార్ భామ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట బోగన్ రీమేక్ మేకర్స్.