''నేను కవిని కాను అన్నవాడిని కత్తితో పొడుస్తా'' అంటూ ఒక సినిమాలో ఒక లేడీ కమెడియన్ కామెడీ చేస్తుంది. ఎక్కడ ఆమె రాసింది కవిత కాదు అని చెబితే.. తిరిగి తమను పొడుస్తుందేమో అని భయపడి.. చుట్టూ ఉన్న వారు 'వాటే కవిత' అంటూ ఆమెను పొగిడేస్తారు. 90లలో జంధ్యాల వారు ఇలాంటి కామెడీలు అనేకం రశారు. కాకపోతే ఇప్పుడు ఆ కామెడీలే నిజంగా మారుతున్నాయి.
''కబాలి'' ప్రొడ్యూసర్ కలైపులి ఎస్.థాను మాటలు వింటుంటే.. మనకు ఆ కవితను చెప్పే కవి గుర్తురాక మానరు. కబాలి సినిమా ఇప్పటికి 326 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.. హైయస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమా ఇదే అంటూ ఆయన ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రోబో సినిమా కలక్షన్లకు కూడా బీట్ చేసినందుకు ఆయన సంతోషం వ్యక్తపరిచాడు. అదేంది సారూ.. తెలుగులో 30 కోట్లు పెట్టి సినిమాను కొంటే.. దాదాపు 6-8 కోట్లు లాస్ వచ్చేలా ఉందట పరిస్థితి? మీకు మాత్రం కబాలి సూపర్ హిట్ అని ఎలా అనిపించింది? పైగా ఇప్పటివరకు అన్ని రివ్యూలూ నెగెటివ్ గానే వచ్చినా కూడా.. థాను మాత్రం వాటి గురించి చెప్పట్లేదు. కబాలి సూపర్ హిట్ అంతే అంటున్నాడు.
ఇప్పుడు ఈయన ముందు ఎవరన్నా హిట్టు ఎలా సార్ అంటే.. మరి 300+ కోట్లు ఎలా వచ్చాయి అని కూడా ఏకేస్తున్నారు. మొన్న తొలిరోజున ఈయనే 200 కోట్లు ధియేట్రికల్ కలక్షన్ తో పాటు 200 కోట్ల ప్రీ-రిలీజ్ శాటిలైట్ వగైరా సేల్స్ ను కలిపి 400 కోట్లు వచ్చాయి అన్నారు. ఇప్పుడు 326 కోట్లకు కూడా ఆ 200 కలిపి.. రేపు 526 కోట్లు వచ్చాయని కూడా చెబుతారు.