సినిమా ఇండస్ట్రీలో కూడా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. టీవీ రంగంకు చెందిన వారు పలువురు వైరస్ పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ వారు షూటింగ్ ఇంకా మొదలు పెట్టక పోవడమే మంచిది అయ్యిందంటున్నారు. కొందరు షూటింగ్స్ చివరి దశలో ఉండటంతో వాటిని పూర్తి చేసేందుకు షూటింగ్ కు వెళ్లారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ తన సూపర్ మచ్చి చిత్రం షూటింగ్ ను పూర్తి చేశాడు. గత నెలలో సూపర్ మచ్చి చిత్రంను పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేస్తున్నామంటూ కళ్యాణ్ దేవ్ పేర్కొన్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే కళ్యాణ్ దేవ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తుంది.
ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా పేర్కొన్నాడు. తన కూతురు పుట్టిన రోజు అయినా కూడా తాను ఆ కార్యక్రమంలో హాజరు కాలేక పోయాను. పిల్లల ఆరోగ్యం కోసం నేను సామాజిక దూరం పాటించాల్సి వస్తుందంటూ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ తో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కళ్యాణ్ దేవ్ కు వైరస్ నిర్ధారణ టెస్టు పాజిటివ్ వచ్చిందని అందుకే స్వీయ నిర్భందంలో ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుంటే ఎందుకు దూరంగా ఉంటారంటూ లాజిక్ లు తీస్తున్నారు. కాని కళ్యాణ్ దేవ్ మాత్రం సూపర్ మచ్చి షూటింగ్ లో పాల్గొన్న కారణంగా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భందంలో ఉంటున్నట్లుగా పేర్కొన్నాడు. కళ్యాణ్ దేవ్ చేస్తున్న పనిని సమర్ధించే వారు కూడా లేకపోలేదు. పిల్లల ఆరోగ్యం తన వల్ల ఇతరులు ఇబ్బందికి గురి కాకుండా ఉండాలనుకోవడం మంచిదంటూ ప్రశంసలు కురిపించారు.