నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. అతడి కెరీర్లో విజయాలు చాలా చాలా తక్కువ. ‘అతనొక్కడే’.. ‘పటాస్’ మినహాయిస్తే నిఖార్సయిన హిట్లే లేవు ఈ నందమూరి హీరో కెరీర్లో. కొన్నేళ్ల కిందట ‘పటాస్’తో మంచి విజయాన్నందుకుని కెరీర్ ను గాడిన పెట్టుకున్నట్లే కనిపించాడు కానీ.. తర్వాత కథ షరా మామూలే. వరుసగా అతను చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే అయ్యాయి. చివరగా ఈ ఏడాది ‘నా నువ్వే’ లాంటి లవ్ స్టోరీతో పలకరించాడు. తన ఇమేజ్ కు భిన్నంగా చేసిన ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. కళ్యాణ్ రామ్ కు అత్యంత సన్నిహితుడు.. అతడి వ్యక్తిగత పీఆర్వో కూడా అయిన మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు.
ఐతే ఆ సినిమా ఫలితంతో నిరాశ చెందకుండా మళ్లీ అదే బేనర్ లో ఓ భారీ బడ్జెట్ సినిమా మొదలుపెట్టాడు కళ్యాణ్ రామ్. సీనియర్ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తయిందట. తన తండ్రి మరణానంతరం కొన్ని రోజులకే ఈ చిత్ర షూటింగ్ కు వెళ్లాడు కళ్యాణ్ రామ్. దాన్ని ముగించాకే తర్వాత ‘యన్.టి.ఆర్’ మీదికి వెళ్లాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్-గుహన్ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఇదొక థ్రిల్లర్ మూవీ అని సమాచారం. త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ టీజర్ విడుదల చేస్తారట. ఈ ఏడాది చివర్లోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఈ చిత్రం ఎంతో కీలకం. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో?