హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో సమీకరణాలు మారాయి. బాలయ్య మళ్లీ జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లకు కొంచెం దగ్గరయ్యాడు. తన అన్న అంత్యక్రియల సమయంలో అన్నీ తానై వ్యవహరించాడు బాలయ్య. ఆ తర్వాత ఎన్టీఆర్ ిసనిమా ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కు కూడా బాలయ్య అతిథిగా హాజరయ్యాడు. ఇటు కళ్యాణ్ రామ్.. అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ రాబోయే ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు-బాలయ్య భావిస్తున్నట్లుగా విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేశారు. కళ్యాణ్ రామ్ ను అయితే నేరుగా ఎన్నికల్లో నిలబెట్టాలని కూడా చూస్తున్నట్లు ఇటీవలే జోరుగా ఊహాగానాలు సాగాయి.
తాజా సమాచారం ప్రకారం ఇంకో నెల రోజుల్లో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని బాలయ్య కళ్యాణ్ రామ్ ను కోరినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ పోటీ చేస్తే అతను గెలిచేందుకు మంచి అవకాశాలుంటాయని. హరికృష్ణ తాలూకు సానుభూతి కలిసొస్తుందని.. అలాగే పార్టీకి కూడా మేలు జరుగుతుందని బాబు-బాలయ్య ఆలోచన చేశారట. కానీ బాలయ్య ప్రతిపాదనను కళ్యాణ్ రామ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇంకో పదేళ్ల పాటు తాను సినిమాల మీద తప్ప వేరే విషయాలపై దృష్టి పెట్టనని.. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో బాలయ్య ఏమీ చేయలేకి సైలెంటుగా ఉండిపోయాడట. మరి బాబు నేరుగా కళ్యాణ్ తో ఏమైనా రాయబారం నడుపుతాడేమో చూడాలి.