ఒక ఇంట్లో వాళ్లకు విభిన్న అభిప్రాయాలుండటం సహజం. ఐతే బయటి వాళ్ల ముందు మాత్రం అంతా ఒకే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తారు. ఫిలిం సెలబ్రెటీల విషయానికి వస్తే ఏదైనా ఇష్యూ మీద తమ పెద్ద వాళ్లు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే వాళ్ల పిల్లలు కూడా అదే తరహాలో మాట్లాడుతుంటారు. కానీ కమల్ హాసన్.. ఆయన తనయురాలు శ్రుతి హాసన్ మాత్రం ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ రజనికీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంపై కమల్ ను ఆ మధ్య ప్రశ్నిస్తే.. ఆయన వ్యతిరేక అభిప్రాయం వినిపించారు. రజినీకాంతే కాదు.. ఇంకే సినీ నటుడు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాకూడదన్న అభిప్రాయాన్ని కమల్ వ్యక్త పరిచారు. రజినీకి కెమెరాల దృష్టిని ఆకర్షించడం ఎలాగో తెలుసంటూ పరోక్షంగా ఆయన విమర్శలు కూడా గుప్పించారు. కానీ శ్రుతి హాసన్ మాత్రం రజినీ రాజకీయారంగేట్రం విషయమై సానుకూలంగా మాట్లాడింది.
రజినీ పొలిటికల్ ఎంట్రీ మీద మీ అభిప్రాయం ఏంటంటూ ఆమెను ప్రశ్నిస్తే.. ‘‘రాజకీయాల్లోకి రావాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది రజినీ సార్. ఐతే ఆయన పాలిటిక్స్ లోకి వస్తే నేను మద్దతివ్వడానికి సిద్ధం’’ అని పేర్కొంది. కమల్ రజినీ పొలిటికల్ ఎంట్రీ మీద చేసిన వ్యాఖ్యలపై శ్రుతికి ఐడియా ఉందో లేదో మరి. ఐతే తన పిల్లల్ని చిన్నప్పట్నుంచి స్వతంత్రంగా పెంచడమే కాక.. వాళ్లకంటూ ఓ అభిప్రాయాలు ఉండేలా చూసుకున్నారు కమల్. కాబట్టి శ్రుతి ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదేమో.