ప్రగ్యా జైస్వాల్... ట్రెడిషనల్ టచ్‌లో సొగసైన గ్లామర్

ఫ్లోరల్ డిజైన్‌లతో ఆకట్టుకునే ఈ అవుట్‌ఫిట్‌ ఆమెను మరింత ఆకర్షణీయంగా చూపించింది.

Update: 2025-01-09 09:30 GMT

గ్లామరస్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందం, అభినయం, ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఆమె టాలెంట్ గురించి అందరికీ తెలుసు. ఇక సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ మెరుపులతో సందడి చేసే అమ్మడు మరోసారి వైరల్ గా మారింది. ఇటీవల ఆమె షేర్ చేసిన డిఫరెంట్ డ్రెస్‌లోని ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచాయి. ఫ్లోరల్ డిజైన్‌లతో ఆకట్టుకునే ఈ అవుట్‌ఫిట్‌ ఆమెను మరింత ఆకర్షణీయంగా చూపించింది.


లెహంగాలోని రంగుల హార్మనీకి ఆమె చిరునవ్వు జతకలిసి ఫోటోషూట్‌కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకువచ్చింది. ప్రత్యేకంగా ఎంచుకున్న ఆభరణాలు, క్లాసిక్ హెయిర్‌స్టైల్‌తో ఈ లుక్‌ మైలేజ్ అందుకుంది. ప్రగ్యా కంచె చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమా విజయం తర్వాత ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. జయ జానకి నాయక లోని ఆమె పాత్ర ఎంతో హైలైట్ అయ్యింది.


తర్వాత వచ్చిన ‘‘అఖండ’’ చిత్రంలో బాలకృష్ణ సరసన ఆమె పాత్ర ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమాతో ప్రగ్యా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కానీ తర్వాతి ప్రాజెక్టుల్లో అంతగా కనిపించకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడామె దృష్టి మొత్తం ఫ్యాషన్ మీదే. ప్రముఖ డిజైనర్ల ఔట్‌ఫిట్లను ధరించి రెగ్యులర్‌గా ఫోటోషూట్లు చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది.


ఈ మధ్యకాలంలో బ్రౌన్ నెట్ గౌన్, లహంగాల్లోని ఫోటోషూట్ల ద్వారా ఆమె తన స్టైల్ స్టేట్మెంట్‌ను మరింత బలపరచుకుంటోంది. ‘‘డాకూ మహారాజ్’’ ప్రొమోషన్స్ కోసం ఆమె షేర్ చేసిన తాజా ఫోటోలు మరోసారి ఆమె గ్లామర్‌ను సుస్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు భారీగా లైక్స్‌ మరియు కామెంట్లు పెడుతున్నారు. ప్రగ్యా ప్రస్తుతం తన కెరీర్‌ని మళ్లీ టాప్‌ గేర్‌లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణతో కలిసి అఖండ 2 చిత్రంలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో తెరకెక్కనున్న టైసన్ నాయుడు చిత్రంలోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌కు మరోసారి బూస్ట్ ఇవ్వనున్నాయనే నమ్మకం ఉంది.



Tags:    

Similar News