సేనాప‌తి స‌మ‌రం ఈ సారి దేనిపైన‌?

Update: 2022-11-21 01:30 GMT
దాదాపు 26 ఏళ్ల క్రితం అంటే 1996లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయకుడిగా శంక‌ర్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన సెమీ పీరియాడిక్ ఫిక్ష‌న్ మూవీ `ఇండియ‌న్‌`. శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీని తెలుగులో `భార‌తీయుడు`గా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లోనూ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా విడుద‌లైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టించింది.

ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో బ్రిటీష్ పాల‌కుల‌పై నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ స్ఫూర్తితో పోరాడిన సేనాపతి క‌థ‌గా ఈ మూవీని శంక‌ర్ నాటి కాలానికి, ప్ర‌స్తుత టైమ్ కి లింక‌ప్ చేస్తూ త‌రాల మ‌ధ్య వున్న అంత‌రాన్ని, దేశ భ‌క్తిని ప్ర‌ధానంగా చ‌ర్చిస్తూ ఇండిపెండెన్స్ ఇండియాలో పురిగిపోయిన లంచ‌గొండి త‌నం ని ప్ర‌ధాన ఇతివృత్తంగా ఎంచుకుని దాన్ని నిర్మూలించే క్ర‌మంలో హ‌త్య‌లు చేసే పండు ముస‌లి సేనాప‌తి క‌థ‌గా ఈ మూవీని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు సంచ‌ల‌నం సృష్టించింది.

క‌మ‌ల్ హాస‌న్ గెట‌ప్, సేనాప‌తి లుక్ అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా మారింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత ఈ మూవీకి సీక్వెల్ గా `ఇండియ‌న్ 2`ని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేతి అల్లిరాజా సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. గ‌తంలో క్రేన్ యాక్సిడెంట్ కార‌ణంగా సెట్లో న‌లుగురు చ‌నిపోవ‌డం.. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు, లైకా కు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో ఈ మూవీని అర్థాంత‌రంగా ఆపేశారు.

రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది. కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్ధ్, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్, మిన్నాల్ ముర‌ళి  ఫేమ్ గురు సోమ‌సుంద‌రం, బాబీ సింహా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ లో దేశంలో పెరిగిపోయిన లంచ‌గొండి త‌నంపై స‌మ‌రం చేసిన సేనాప‌తి.. `ఇండియ‌న్ 2`లో ఏ అంశంపై ప్ర‌ధానంగా క‌త్తి ఎక్కుపెట్ట‌బోతున్నాడ‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ గానే వుంది.

మ‌ళ్లీ లంచ‌గొండి త‌నం అంటే చూసిన అంశం.. తెలిసిన అంశ‌మే కాబ‌ట్టి అంత ఎఫెక్టీవ్ గా వుండ‌దు. మ‌రి ఈ నేప‌థ్యంలో సేనాప‌తి ఈ సారి దేనిపై స‌మ‌ర శంఖం పూరించ‌బోతున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న అంశాలు రెండే రెండు..ఒక‌టి పాలిటిక్స్‌.. రెండు అత్యాచారాలు.. ఈ రెండు అంశాల‌లో ఏ అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకుని తెర‌పై చూపించ‌బోతున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. వీటికి భిన్నంగా స‌రికొత్త అంశంతో యువ‌త‌ని చైత‌న్య వంతుల్ని చేసే క‌థ‌నంతో శంక‌ర్ రాబోతున్నాడా? అన్న‌ది తెలియాలంటే వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News