బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ స్టార్ హీరోలకే పోటీగా నిలిబడి సినిమాలు చేస్తుం ది. ఓవైపు హీరోయిన్ గా హీరోలతో రొమాంటిక్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అన్ని జానర్లని టచ్ చేసి కంగన ఏంటో చూపించే ప్రయత్నం చేస్తుంది.
సంచలనాత్మక బయోపిక్ లతో బాలీవుడ్ ని షేక్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే `తలైవీ`లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించింది. ఎంతో మంది టాప్ స్టార్లు ఉన్నా..ఏ నటి చేయని సాహసం `తలైవి`తో కంగన చేసింది. సీఎం పాత్రలోనే నటించి సత్తా చాటే ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.
అటుపై ఏజెంట్ అగ్ని పాత్రలో `ధాకడ్` తో తన లో యాక్షన్ స్టార్ ని పరిచయం చేసింది. కంగన అంటే రొమాంటిక్ హీరోయిన్నే కాదు...తుపాకీ చేత పడితే ఎలా ఉంటుందన్నది `ధాకడ్` తో నిరూపించింది. ప్రత్యర్ధులపై గుళ్ల వర్షం కురిపించి ఏజెంట్ అగ్ని బాండ్ గాళ్ అని చెప్పకనే చెప్పింది. వీటన్నింకంటే ముందు ఝాన్సీ లక్ష్మీ భాయ్ అవతారంలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
`సిమ్రన్`..`రంగూన్` లాంటి చిత్రాలతోనూ కంగన ముద్ర వేసింది. ప్రస్తుతం `ఎమెర్జెన్సీ` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఏకంగా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలోనే నటిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ లో ఇందిరా గాంధీని దింపేసింది. ఈ సినిమాతో ఇందీరాగాంధీ గురించి తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతుంది. ఇప్పుడీ సినిమా సెట్స్ లో ఉండగానే మరో సంచలన పాత్రకి రెడీ అవుతోంది.
కశ్మీరీ గాయకురాలి పాత్రలో నటించబోతుంది. ఉగ్రవాదుల్లో చేతులు ఛిద్రమై..హతమైన పాత్ర ఇది. ఇలాంటి పాత్ర పోషించడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎన్నో సవాళ్లని ఎదుర్కోవాలి. అవన్నీ నాలో ఉన్నాయంటూ కంగన ముందుకొచ్చింది. ఇలాంటి వాస్తవ సంఘటనలు అధారంగా మధుర భండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫిరోజ్ నడియాద్ వాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇలా కంగన లైనప్ చూస్తుంటే అమ్మడు బాలీవుడ్ పై శమర శంఖం పూరించినట్లే కనిపిస్తుంది. ఉమెన్సెంట్రిక్ చిత్రాలు ఎక్కువగా చేయడం విశేషం. మేల్ డామినేటెడ్ ఇండస్ర్టీలో ఎన్నో రకాల సమస్యలపై సరిసమాన అవకాశాల కోసం చాలా కాలంగా కంగన కృషి చేస్తుంది.
హీరోతో పాటు తమకి సమాన పారితోషికాలు..గౌరవ మర్యాదలు కల్పించాలంటూ సందర్భం వచ్చినప్పుడల్లా చెలరేగుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ర్టీలో తనని తాను ప్రూవ్ చేసుకునే కథల్ని ఎంపిక చేసుకుంటుంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. తానే ఒక లేడీ డిక్టేటర్ గా పరిశ్రమలో అవరిస్తుంది.