మొన్న శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓరి దేవుడా.. ప్రిన్స్.. జిన్నా.. సర్దార్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా ల్లో ఏ ఒక్కటి కూడా సూపర్ డూపర్ సక్సెస్ అన్నట్లుగా సక్సెస్ టాక్ ను దక్కించుకోలేక పోయాయి. ఈ అన్ని సినిమాలు కూడా యూఎస్ లో రిలీజ్ అయ్యాయి.
వీటిల్లో ఏ ఒక్కటి కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఆహా అన్నట్లుగా వసూళ్ల ను నమోదు చేయలేక పోయింది. ఓరి దేవుడా సినిమా మొదటి రోజు దాదాపుగా 65 వేల డాలర్లను మాత్రమే రాబట్టింది. ఇక సర్దార్ సినిమా కూడా పెద్దగా యూఎస్ లో వసూళ్లను నమోదు చేయడం లో విఫలం అయ్యింది. 218 లొకేషన్స్ లో సర్దార్ విడుదల అయినా కూడా 70 వేల డాలర్ల వరకు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక జిన్నా సినిమా విషయానికి వస్తే కేవలం 800 డాలర్లను మాత్రమే సినిమా రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ జిన్నా సినిమా ను జనాలు పట్టించుకోవడం లేదు. ఇక ప్రిన్స్ సినిమా యొక్క పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు.
తమిళ వెర్షన్ మరియు తెలుగు వెర్షన్ కలిపి కూడా లక్ష డాలర్లను కూడా రాబట్టలేకపోయింది. అయితే మొన్న విడుదల అయిన సినిమాల్లో ప్రిన్స్ అక్కడ కాస్త ఎక్కువగా రాబట్టింది అనవచ్చు. శివ కార్తికేయన్ కి ఉన్న ఫాలోయింగ్ కారణంగా సినిమా కు ఆ మాత్రం కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
ఈ వారం విడుదల అయిన సినిమాలతో పోల్చితే గత వారం విడుదల అయిన సినిమా కాంతార కు ఎక్కవ వసూళ్లు నమోదు అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కాంతార జోరు కంటిన్యూ అవుతుంది. యూఎస్ లో ఇప్పటి కాంతార సినిమా మిలియన్ డాలర్ల మార్క్ ను టచ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరో మిలియన్ డాలర్ల వరకు కాంతార రాబట్టినా ఆశ్చర్యం లేదు.